రాజ్ భవన్ లో శాశ్వత ఉద్యోగాక పేరిట నిరుపేద ఉద్యోగార్ధులను మోసగించటం పై గవర్నర్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగార్ధుల నుండి అక్రమంగా నగదు వసూలు చేయడంపై బిస్వభుషణ్ హరిచందన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన వ్యక్తులు వ్యవస్థలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కటిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పోలీసు యంత్రంగాన్ని ఆదేశించారు. రాజ్ భవన్ లో పొరుగు సేవల ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మైసర్స్ సుమతి కార్పోరేట్ సర్వీసెస్ ప్రేవేట్ లిమిటెడ్ కు చెందిన కొందరు పర్యవేక్షకులు కొందరు ప్రోటోకాల్ సిబ్బంది బయటి వ్యక్తులు పొరుగు సేవల సిబ్బంది నియామకానికి సంబంధించి అక్రమాలకూ పోలప్ద్దరని రాజ్ భవన్ లో అటెండర్లు రిసెప్షనిస్టు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వంటి పోస్టుల నియామకం సదరు ఏజెన్సీ ద్వారా చేపట్టటం జరిగింది. ఈ పొరుగు సేవల నియామకాలకు సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన ఫిర్యాదును గవర్నర్ దృష్టికి తీసుకురాగా ఆయన సూచనల మేరకు గవర్నర్ వారి కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రెండురోజుల పాటు సాగిన విచారణలో రాజ్ భవన్ లో శాశ్వత ఉదోగాలు ఇప్పిస్తామాని వాగ్దానం చేస్తూ సుమతి కార్పోరేషన్ పర్యవేక్షక సిబ్బంది మరికొందరు దళారుల ప్రమేయంతో మొత్తం తొమ్మిది మంది నుండి నగదు వసూలు చేసిన విషయాన్నీ కమిటీ గుర్తించింది. అడనుగునంగా వారి అభియోగాలను కమిటీ నమోదు చేసింది. ఈ నివేదికను గౌరవ గవర్నర్ హరిచందన్ కు సమర్పించగా ఆయన శాశ్వత ఉద్యోగాలు కల్పించడం పేరిట పేద ప్రజలు నుండి అనుచితంగా చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం పైతీవ్రంగా మండిపడ్డారు. రాజ్ భవన్ వంటి కార్యాలయం విషయంలోనూ ఇలాంటి అవాంచనీయ సంఘటన జరగటం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చట్ట విరుద్దమైన చర్యకు పాల్పడిన ఏజెన్సీ పర్యవేక్షకులు సంబందిత వ్యక్తులపై తక్షణం చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గౌరవ గవర్నర్ రాజ్ భవన్ కార్యదర్శిని ఆదేశించారు. ఫలితంగా బుధవారం విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును రాజ్ భవన్ కు పిలిపించి గవర్నర్ శాశ్వత ఉద్యోగాలు కల్పించడం పేరిట పేద ఉద్యోగార్ధులను మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరో వైపు చట్టవిరుద్ద చర్యలకు పాల్పడిన ఏజెన్సీ ప్రమేయుం పై చర్యలకు ఉపక్రమించామని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
ఏపీ రాజ్భవన్లో అక్రమంగా ఉద్యోగాలు
Related tags :