మిర్చి అనగానే నషాళాన్నంటే మంటే గుర్తొస్తుంది. కానీ మిరప శరీరంలో పేరుకుపోయిన విషతత్వాలను నిర్మూలిస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో నిల్వ ఉండే హానికర విష రసాయనాలను శుభ్రం చేస్తుంది. అలాగే మిరప రక్తశోధకంగానూ పనిచేస్తుంది. చెన్నైకి చెందిన క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పచ్చిమిర్చిలో క్యాన్సర్ను నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు ధృవీకరించింది. మిర్చిలో క్యాన్సర్ కారకాలతో పోరాడే బీటా కెరోటిన్ వంటి పోషకాలుంటాయి. ఆర్థరైటిస్తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. ఇంత మేలుచేసే మిరపతో ప్రత్యేకమైన కొన్ని వ్యాధులను నివారించవచ్చు. గొంతు బొంగురు పోయినప్పుడు టీ స్పూన్ పంచదారను, ఒకటీ రెండు బాదం గింజలను, ఒక పండు మిరపకాయను కలిపి దంచాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి, తీసుకుంటే ఉపాధ్యాయులకు, గాయకులకు, ఉపన్యాసకులకు గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. కడుపునొప్పి వస్తే 100 గ్రాముల బెల్లంలో గ్రాము ఎర్ర మిరపపొడిని కలిపి చిన్నచిన్న మాత్రలుగా తయారుచేసి, నీళ్లతో తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. అర గ్రాము ఎండు మిరపపొడిని రెండు గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి. ఎగ్జిమా, దురద, కీళ్లనొప్పి, కుక్కకాటు, కందిరీగ కాటు వంటి సమస్యల్లో మిరప పండ్ల తైలాన్ని పైపూతగా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
బొంగురు గొంతు ఇబ్బంది పెడుతుంటే…
Related tags :