*దేశంలో వాహన విచ్చిన్నం రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాట్ల నిమిత్తం నూతన జాయింట్ వెంచర్ను నెలకొల్పిన ట్లు మారుతీ సుజికీ ఈన్దియా , టయోటా సుశో సంస్థలు బుధవారం ప్రకటించాయి.
* ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ నోకియా.. భారత కన్సూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి త్వరలోనే స్మార్ట్ టీవీలను ఇక్కడి మార్కెట్లో విడుదలచేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు వెల్లడించింది. భారత వినియోగదారులకు తగిన విధంగా నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీల తయారీ, పంపిణీని ఫ్లిప్‌కార్ట్ సులభతరం చేయనుందని ఒక ప్రకటనలో తెలియజేసింది.
*పరారీ ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. అసాధారణ రీతిలో 40 లక్షల పౌండ్ల సెక్యూరిటీ ఆఫర్ చేయడంతో పాటు హౌస్ అరె్స్టకు సుముఖత తెలిపినప్పటికీ లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఎన్ఏసీఎల్ ఇండస్ర్టీస్ ఏకీకృత ప్రాతిపదికన రూ.305.65 కోట్ల ఆదాయంపై రూ.6.67 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంకు సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.129.76 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*కెనరా బ్యాంకు కన్సాలిడేటెడ్ నికర లాభం సెప్టెంబరు త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.405.49 కోట్లకు చేరుకుంది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.13,437.83 కోట్ల నుంచి రూ.15,509.36 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయం రూ.11,015.93 కోట్ల నుంచి రూ.12,500.37 కోట్లకు చేరింది.
*బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దేశాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో విశాఖపట్నంలో పోర్టుల సదస్సును నిర్వహిస్తున్నారు.
*అల్లాయ్ వీల్స్ తయారీలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన విశాఖ వీఎ్సఈజెడ్కు చెందిన సినర్జీస్ కాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ బ్లాక్ క్రోమ్ వీల్స్ను తయారుచేసింది.
*తెలంగాణలోని జిల్లాల్లో బీపీవో కంపెనీలు పెట్టాలని ఎన్నారైలను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ కోరారు.
*ఢిల్లీ సమీపంలో జేవర్ దగ్గర కొత్తగా ఏర్పాటు చేయనున్న విమానాశ్రయ ప్రాజెక్ట్ కోసం జీఎంఆర్ నిర్వహణలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (డీఐఏఎల్)తో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్, జూరిచ్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఏజీ, యాంకరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ బిడ్లు సమర్పించాయి. టెక్నికల్ బిడ్డింగ్లో అర్హత సాధించే కంపెనీల ఫైనాన్సియల్ బిడ్ను ఈ నెల 29న తెరవనున్నారు.
*తెలంగాణలోని జిల్లాల్లో బీపీవో కంపెనీలు పెట్టాలని ఎన్నారైలను ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బి. వినోద్కుమార్ కోరారు.
మారుతీ, టయోటా సుషో జాయింట్ వెంచర్-వాణిజ్యం-11/07
Related tags :