Movies

గల్లా వారి హీరో

MP Galla Jayadev's Son To Be Tollywood Actor

ప్రముఖ రాజకీయ నేత, వ్యాపారవేత్త గల్లా జయ్‌దేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా పరిచయంకానున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందించనున్నారు. గల్లా పద్మావతి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈనెల 10వ తేదీన చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరగనుంది. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్‌ దంపతులు సోషల్‌మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.‘మా కుమారుడు గల్లా అశోక్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తునందుకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మా సొంత నిర్మాణ సంస్థ అమర్‌ రాజా ప్రొడక్షన్స్‌పై నిర్తిస్తున్నాం. నవంబర్‌ 10వ తేదీన ఉదయం 11.15 గంటలకు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటున్నారు’ – గల్లా జయ్‌దేవ్‌, పద్మావతిగతేడాది గల్లా అశోక్‌ కథానాయకుడి పరిచయం చేస్తూ.. ‘అదే నువ్వు అదే నేను’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఆ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.