Devotional

నవంబరు నెల రాశి ఫలాలు ఇవే

November 2019 Astrology-Telugu Devotional News-నవంబరు నెల రాశి ఫలాలు ఇవే

1.నవంబరు నెల రాశి ఫలాలు ఇవే

2.శబరిమలకు 20 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జోన్ పరిధిలో.. హైదరాబాద్, కాచిగూడ, మచిలీటప్నం, కాకినాడ, స్టేషన్ల నుంచి కేరళ లోని కొల్లాంకు 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే బుధవారం ch ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
3.యాదాద్రిలో నిరంతర నిఘా – ప్రధానాలయానికి ప్రత్యేక భద్రత
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రిలోని పంచనారసింహుల సన్నిధిలో కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ దిశా నిర్దేశంతో నిరంతర నిఘా మొదలైంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ఈ క్షేత్ర సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఆలయం చెంత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా కొనసాగనుంది. సాయుధ దళం (ఏఆర్) నుంచి 22 మంది, ప్రత్యేక పోలీసు దళం (ఎస్పీఎఫ్) నుంచి 10 మంది, 30 మంది హోంగార్డులతో భద్రత కల్పించాలని నిర్ణయించారు. హోంగార్డులు, ఎస్పీఎఫ్ జవాన్లు గత కొంతకాలంగా విధులు నిర్వర్తిస్తుండగా సాయుధ పోలీసులతో 24 గంటల నిఘాను ఇటీవలే ప్రారంభించినట్లు ఆ విభాగం ఏసీపీ కృష్ణయ్య తెలిపారు.
4. ప్రధానార్చకుడిగా బాధ్యతలు చేపడతా ఏవీ రమణదీక్షితులు వెల్లడి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మరో వారం రోజుల్లో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తితిదే ఆగమ సలహామండలి సభ్యుడు ఏవీ రమణదీక్షితులు వెల్లడించారు. సలహా మండలి సభ్యుడిగా గురువారం ఆలయ ప్రవేశం చేయనున్నట్లు చెప్పారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్లో సహచర సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆలయ అర్చకులు జూనియర్లుగా పనిచేస్తారని చెప్పారు.
5. పంచాంగం ? 07.11.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: శుక్ల
తిథి: దశమి 10:07 వరకు
తదుపరి ఏకాదశి
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: శతభిషం 10:23 వరకు
తదుపరి పూర్వాభద్ర
యోగం: ధృవ, వ్యాఘత
కరణం: గరజ
వర్జ్యం: సా.05:28 – 07:14
దుర్ముహూర్తం: 10:05 – 10:51
మరియు 02:39 – 03:25
రాహు కాలం: 01:25 – 02:51
గుళిక కాలం: 09:08 – 10:33
యమ గండం: 06:16 – 07:42
అభిజిత్ : 11:37 – 12:21
సూర్యోదయం: 06:16
సూర్యాస్తమయం: 05:42
వైదిక సూర్యోదయం: 06:20
వైదిక సూర్యాస్తమయం: 05:38
చంద్రోదయం: ప.02:42
చంద్రాస్తమయం: రా.01:52
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: దక్షిణం
చంద్ర నివాసం: పశ్చిమం
శ్రీ సత్యవరతీర్థ పుణ్యతిథి
కంసాసుర వధ
విశాఖ కార్తె
శ్రీవిజయదాసర పుణ్యతిథి?
6. రాశిఫలం – 07/11/2019
తిథి:
శుద్ధ దశమి ఉ.9.09 , కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
శతభిషం ఉ.9.34
వర్జ్యం:
సా.4.39 నుండి 6.25 వరకు
దుర్ముహూర్తం:
ఉ.10.00 నుండి 10.48 వరకు తిరిగి మ.2.48 నుండి 3.36 వరకు
రాహు కాలం
మ.1.30 నుండి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నా బంధువులతో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. ఔషధ సేవ తప్పదు. తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. ఆలస్యంగా మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిరనివాసముంటుంది. వ్యవసాయ లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి.విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. చెడు సహవాసంవైపు వెళ్లకూడదు. క్షణికావేశం పనికిరాదు. ఋణప్రయత్నం ఫలిస్తుంది.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. దైవదర్శనం ఉంటుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ఇబ్బందులెదురవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వుంటాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే
7. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
07.11.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-27℃°

• నిన్న 65,024 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 01
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.36 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
వయోవృద్దులు / దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
8. శ్రీరస్తు శుభమస్తు
తేది : 7, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : బృహస్పతివాసరే (గురువారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న ఉదయం 7 గం॥ 22 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 55 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి)
నక్షత్రం : శతభిషం
(నిన్న ఉదయం 6 గం॥ 15 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు శతభిషం నక్షత్రం తదుపరి పూర్వాభాద్రా నక్షత్రం)
యోగము : (ధ్రువం ఈరోజు ఉదయం 8 గం ll 42 ని ll వరకు తదుపరి వ్యాఘాతం రేపు ఉదయం 9 గం ll 33 ని ll వరకు)
కరణం : (గరజి ఈరోజు ఉదయం 9 గం ll 55 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 59 ని ll)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 57 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 9 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 6 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 17 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కుంభము
విశాఖ కార్తె ప్రారంభం
తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకుhttp://www.edukondalu.com/
9. శుభోదయం
మహానీయుని మాట
” మనసు చెప్పినట్టు మనం వినడం కాదు,
మనం చెప్పినట్టు మనసు వినాలి.”
నేటీ మంచి మాట
” ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం.
అవసరమైనదాని కంటే తక్కువ తీసుకోవడం గౌరవం. ”
తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకు
http://www.edukondalu.com/
10. నేటి సామెత పగ బట్టిన త్రాచులాగ
త్రాసు పాము పగ బట్టితే ఎప్పటికి మరచిపోక తన పగ తీర్చు కోవడానికి వేచి చూస్తుంటుందని ప్రజల మూడ విశ్వాసము. ఆ విధంగా ఈ సామెత పుట్టింది. పాములు పగపట్టడం ఒక మూడ నమ్మిక మాత్రమే*
తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకుhttp://www.edukondalu.com/
11. నేటి జాతీయం
కొళ్ల బోయింది
దీనికి కొంత వివరణ కావాలి: అదేమంటే…… గతంలో /….. ఇప్పుడు కూడ/ చెరువులు, కుంటలు మొదలగు నీటి వనరులలో చేపల పెంపకం సాగించే వారు. బెస్త వారు గాని మిగతా వారు గాని ఆ చెరువును వేలం పాటలో పాడుకొని అందులోని చేపలను పట్టుకొని అమ్ముకొని తమ పెట్టు బడిని రాబట్టు కునే వారు. ఆ చెరువులో నీరు తగ్గి ఇక చేపల పెంపకానికి వీలు పడదని తెలిసినప్పుడు వున్న పెద్ద చేపల్ని పట్టేసుకుని చెరువు కొళ్ల బోయిందని ప్రకటిస్తారు. దాంతో ఆ చుట్టు పక్కల పల్లె వాసులు ఆ చెరువులో మిగిలిన చిన్న చిన్న చేపలను ఉచితంగా పట్టు కొనుటకు అనుమతి లభించి నట్లే. ఆ విధంగా చెరువు కొళ్ల బోగా వూరి జనాలు చేపలు పట్టాడానికి చెరువుకు వెళ్లతారు. ఇదీ చెరువు కొళ్ల బోవడం అంటారు.
తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకు
http://www.edukondalu.com/
12. నేటి ఆణిముత్యం
నడవక చిక్కి లేమి యగునాఁడు నిజోదరపోషణార్థమై
యడిగిభుజించుటల్నరుల కారయవ్యంగ్యముకాదు పాండవుల్
గడుబలశాలు రేవురు నఖండవిభూతిఁ దొలంగి భిక్షముల్
గడువరె యేకచక్రపురిఁ గుంతియుఁదారొక చోట? భాస్కరా!
భావం:
మానవుడు కుటుంబము జరుగనప్పుడు, ఒకరిని యాచించి తిని బ్రతుకుట తప్పు గాదు. మహాబలపరాక్రమ సంపన్నులగు పాండవులు ఐదుగురూ, కాలవశమున సంపదలను విడనాడి, తల్లితో కలసి ఏకచక్రనగరమున బిచ్చమెత్తుకొని తిని కాలమును గడపలేదా?
తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకు
http://www.edukondalu.com/
13. మన ఇతిహాసాలు
రామాయణం, మహాభారతం- రెండింటిలోనూ కనిపించే ఒకే పాత్రలురామాయణ మహాభారతాలు హిందూ పురాణాలలో మహా కావ్యాలుగా పూజింపబడుతూ యుగయుగాలుగా గౌరవించబడుతున్నాయి. హిందువులు వీటిని కేవలం కధలుగా కాకుండా ఇతిహాసం లేదా చరిత్ర గా భావిస్తారు.ఈ కావ్యాలలో వర్ణించబడిన సంఘ్తటనలు నిజం గా జరిగాయని, మరియూ వాటిలోని పాత్రధారులు ఒకప్పుడు రక్త మాంసాలతో కూడిన శరీరం తో భూమి మీద తిరిగారనీ హిందువుల విశ్వాసం. రామాయణం త్రేతా యుగం(యుగాలలో రెండవది)లో జరిగితే, మహాభారతం ద్వాపర యుగం(మూడవ యుగం) లో జరిగింది. ఈ రెంటి నడుమ చాలా సంవత్సరాల వ్యత్యాసం(బహూశా కొన్ని మిలియన్ల సంవత్సరాలు) ఉంది.కానీ ఈ రెండింటిలోనూ కనిపించిన పాత్రలు కొన్ని ఉన్నాయి. హనుమాన్ హనుమంతుడు సుగ్రీవుని సచివుడు(మంత్రి) మరియు శ్రీరాముడి భక్తాగ్రేసరుడు.రామయణం లో హనుమంతుని పాత్ర ముఖ్య పాత్రలలో ఒకటి.ఈయన మహాభారతం లో కూడా కనిపిస్తారు.హనుమంతుని సోదరుడైన భీముడు(వాయుదేవుడు వీరి పితామహుడు)సౌగంధికా పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తుండగా ఒక పెద్ద ముసలి వానరం భీముడి దారికి అడ్డంగా తన తోకని అడ్డం పెట్టి పడుకుంది.ఆగ్రహించిన భీముడు తోకని అడ్డం తీయమని అడిగాడు.అప్పుడు ఆ వానరం తాను ముసలిదాన్నయిపోవడం వల్ల అలసిపోయాననీ భీముడే తనని పక్కకి తప్పించాలనీ సమాధానమిచ్చింది.తన శక్తి సామర్ధ్యాల కి గర్వించే భీముడు ముసలి వానరం తోకని కాస్తయినా కదల్చలేకపోయాడు. గర్వ భంగమైన భీముడు తానెవరో తెలుపవలసిందిగా ముసలి వానరాన్ని కోరాడు.అప్పుడు ఆ ముసలి వానరం తాను హనుమంతుడినని చెప్పి భీముడిని ఆశీర్వాదిస్తుంది.తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారం
మరిన్ని విశేషాలకు
http://www.edukondalu.com/
14. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 7
1858: లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడైన బిపిన్ చంద్ర పాల్ జననం (మ.1932).
1867 : ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ జననం (మ. 1934).
1888: ప్రముఖ శాస్త్రవేత్త, చంద్రశేఖర్ వెంకటరామన్ జననం (మ.1970).
1954 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు కమల్ హాసన్ జననం.
1978 : ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు రియో ఫెర్డినాండ్ జననం.
1980 : భారతీయ చిత్ర నేపథ్యగాయకుడు కార్తీక్ జననం.
1981 : భారతీయ సినీ నటి అనుష్క శెట్టి జననం.
2000 : సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న పురస్కార గ్రహీత సి.సుబ్రమణ్యం మరణం (జ.1910).
2005 : సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం అక్షరధామ్ ప్రారంభం.
15. పాండురంగా.. పండరినాథా-నేటి నుంచి ఉత్సవాలు
కోరిన కోర్కెలు తీర్చే దైవంగా చిలకలపూడి పాండురంగస్వామి విరాజిల్లుతున్నాడు. దక్షిణ భారతదేశంలో అతిపురాతన స్వయంభువిగ్రహంతో ఉన్నది ఈ దేవాలయం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెక్కుసంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. కీర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఈక్షేత్రానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. నడుముమీద చేతులతో భక్తులకు దర్శనం ఇచ్చే స్వామివారి విగ్రహం ఇక్కడ ప్రత్యేకం. స్వామివారి పాదాలను తాకే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుంది.
**కల్పవృక్షంగా మర్రిచెట్టు
ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్దమర్రిచెట్టును కల్పవృక్షంగా భావించి భక్తులు పూజలు చేస్తుంటారు. చెట్టుసమీపంలో ఓంకార శబ్ధం వినపడుతుందనేది భక్తుల విశ్వాసం. చిలకలపూడి సంబరాలుగా పేరెన్నికగన్న ఈ ఉత్సవాలలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను తెల్లవార్లు నిర్వహిచేవారు. పౌర్ణమినాడు మంగినపూడి బీచ్‌లో పవిత్రస్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణంలో పాండురంగడిని దర్శించుకుని ఇళ్లకు చేరడం భక్తుల ఆనవాయితీ. కార్తీకమాసంతోపాటు ఇతర సమయాల్లో కూడా మహిళలు చెట్టువద్ద ప్రమిదలతో దీపారాధన చేసి ప్రత్యేకపూజలు చేస్తారు. ఎప్పటినుంచో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడంతో మరింత వైభవంగా జరుగుతున్నాయి.
**ఇదీ చరిత్ర
పాండురంగడి పరమభక్తుడైన టేకి నరసింహానికి స్వామివారు స్వప్నంలో కనపడి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించడంతో మహారాష్ట్ర పండరీపురంలోని దేవాలయానికి నమూనాగా పట్టణంలోని చిలకలపూడిలో దేవాలయ నిర్మాణం చేపట్టారు. స్థల పురాణం ప్రకారం కార్తీకశుద్ధ ఏకాదశి నాడు భక్తులకు దర్శనమిస్తానని స్వామి భక్తుడు నరసింహానికి తెలియజేయగా తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తూ ఆయన నామాన్ని జపిస్తుండగా ఒక్కసారిగా ఆలయంలోని గర్భగుడిలో పెద్దశబ్ధం వచ్చింది. దేవాలయ తలుపులు తీసి చూడగా నిలువెత్తు స్వామివారి విగ్రహం స్వయంభువునిగా దర్శనమిచ్చింది. ఆనాటి నుంచి కార్తీకశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమివరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో 108మంది విఠలభక్తుల విగ్రహాలకు ఆలయాలను నిర్మించారు.
**ఉత్సవాలకు ఏర్పాట్లు
ఈనెల 7 నుంచి 12వ తేదీవరకు ఆలయంలో కార్తీకశుద్ధ ఏకాదశి మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గణపతిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భాగంగా గురుపూజ, గోపూజ, విష్ణుసహస్రనామ పారాయణం, పల్లకీ ఉత్సవం, సత్యన్నారాయణస్వామి వ్రతాలు, రుక్మిణీి పాండురంగని కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ప్రత్యేకమైర రథోత్సవాన్ని ఈనెల 9న నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు టేరకి గంగాధరం తెలిపారు. లక్ష్మీగణపతిహోమం, భజన కార్యక్రమాలతోపాటు రుక్మిణీ అమ్మవారికి కుంకుమపూజలు, లలితా సహస్రనామ పారాయణలు, సహస్ర దీపారాధనలు చేయనున్నట్లు చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయానికి ప్రతిఏటా భక్తులు పెక్కుసంఖ్యలో తరలివస్తారు.దానికి అనుగుణంగా ఆలయంలో క్యూలైన్‌ల ఏర్పాటుతోపాటు పలు వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు పెక్కుసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
16. ధనార్జన
చతుర్విధ పురుషార్థాల్లో ఒకటిగా చెప్పే ధనానికి, సనాతన ధర్మం మనుషుల ధర్మబద్ధ జీవితంలో సముచిత స్థానమే కల్పించింది. పురుషార్థ సాధనలకు అది ముఖ్యమేనంటూ, ధనాన్ని ఏ విధంగా సంపాదించాలో చెప్పే స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. ‘స్వార్జితం ఉత్తమమని, పిత్రార్జితం మధ్యమమని, భ్రాతృ విత్తం అధమమని, స్త్రీవిత్తం అధమాధమం’ అని సూత్రీకరించింది. దొంగతనం, దోపిడి, లంచాల రూపేణా సంపాదించిన ధనానికి ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు, గౌరవం కల్పించలేదు. సక్రమమైన మార్గంలో వచ్చిచేరినదైతే అంతకుమించిన విలువైన ధనం మరొకటి లేదంటుంది. కష్టపడి ధనాన్ని కూడబెట్టుకోవాలనే విషయాన్ని అన్ని వేళల్లో గుర్తుచేస్తూనే ఉంటుంది. అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు- సమస్త జనులకు శుభం, సంక్షేమం కలిగేవిధంగా ధనాన్ని ఉపయోగించమన్నాడు. ఆధునిక ప్రపంచంలోనూ ధనస్వామ్య సిద్ధాంతాలకు భాష్యం చెప్పిన ఆడం స్మిత్‌ నైతిక మార్గమూ ధనార్జనకు మేలేనన్నాడు.ధనం సృష్టించే సౌభాగ్యం సొంతం చేసుకునేందుకు తామీ భూప్రపంచంలో ఎక్కడున్నా మనుషులు తపిస్తూనే ఉంటారు. అందుకోసం దురాక్రమణలకు, యుద్ధాలకు దిగుతుంటారు. విశ్వమంతా విస్తరించి ఉన్న వనరులన్నీ భగవంతుడు సృష్టించినవేనని వారికి అనిపించదు. అపారమైన ఆ సంపద ఆయనకే చెందినదని వారికి అనిపించాలి. ఆ గ్రహింపు కలగనందుకే వెంట తీసుకుపోలేని సంపదలను గురించిన ఆలోచనలు, జీవితంలో అంతిమ క్షణాలకు చేరుకున్నా వారిని వదిలిపెట్టవు. ధనం లేకపోతే బతుకే లేదన్న చింతనతోనే సతమతమవుతుంటారు.మానవ జీవితంలో ధనానికున్న ప్రయోజనం కాదనలేనిదే. మనిషికి సంసార జీవనం సజావుగా సాగాలన్నా, పరిపాలకులైతే దేశాన్ని సమర్థంగా నడపాలన్నా- ధనం అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు సరిపడా ధనం సమకూరి ఉన్నా, మరింతగా అది వచ్చిపడాలన్న మానవ స్వభావం వారిచేత ప్రయత్నాలు చేయించి అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. అత్యాశకు బీజాలు అప్పుడే పడతాయి. అవసరాలతో ఆకాంక్ష బలపడుతుంది. అంతిమ లక్ష్యాలైన ముక్తి, మోక్షాలపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ధనార్జనకు, బానిసైన మనిషి ధనానికున్న శక్తి, దైవశక్తికన్నా బలమైనదన్న భ్రమలోకి జారుకుంటాడు.ధనాన్ని తృణప్రాయంగా చూడనవసరం లేదు. విచక్షణతో దాన్ని వితరణ చేయడంలో పారమార్థిక లాభం ఉంది. ధనమే అన్ని అవసరాలకూ మూలం అనుకునేవారెందరో ఉండవచ్చు. ధనం ఇవ్వగల ధార్మికశక్తితో సత్కార్యాలు చేయగల మహానుభావులుంటారు. అన్ని యుగాల్లో వారు మనకు దర్శనమిస్తారు. పరిపాలన కోసం సమీకరించే ధనమైతే అది ప్రజాసంక్షేమానికి వినియోగపడినప్పుడు ఆదర్శవంతమైన పాలన వ్యవస్థలు ఏర్పడతాయి. మరింత సౌభాగ్యాన్ని సృష్టించేందుకూ ఆ ధనం దోహదపడుతుంది.ఆత్మజ్ఞాన సాధనలకు ధనం ఎప్పుడూ అడ్డంకి కాదు. ఆధ్యాత్మికుడైనప్పుడు మనిషికి ఆ విషయం అర్థం కాకమానదు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనానికి సనాతన ధర్మం అభ్యంతరం చెప్పదు. మనుషుల మధ్య జీవిస్తున్నంత కాలం ఏ మనిషీ ధనాన్ని త్యజించలేడు. ధనం మీద వ్యామోహాన్ని అదుపులో ఉంచుకోగల శక్తి ఆధ్యాత్మిక సాధనలతో అతడికి కలిగి తీరుతుంది.