సినిమాల్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ సహజత్వానికి పెద్ద పీట వేస్తున్నారు దర్శక, నిర్మాతలు. నటీనటులు కూడా ఆయా పాత్రలకి ప్రాణం పోసేందుకు తపిస్తున్నారు. కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కోసం రణ్‌వీర్ సింగ్ ఏకంగా కపిల్ దేవ్ ఆధ్వర్యంలో క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం పరిణీతి చోప్రా కూడా రణ్‌వీర్‌ని ఫాలో అవుతోంది. సైనాగా మారేందుకు స్వయంగా సైనా దగ్గర శిక్షణ పొందుతోంది. ‘నేను ఈ సినిమా కోసం అన్ని విధాలుగా సైనాలా మారే ప్రయత్నం చేస్తున్నా. అందుకోసం సైనా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. ఇంట్లో ఆమె జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి డైట్ ఫాలో అవుతుంది?, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆమె హావభావాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు కోవాలనుకుంటున్నా. వాళ్ళింటికి వెళ్లేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’ అని తెలిపింది. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ వంటి తదితర చిత్రాల్లో పరిణీతి నటిస్తూ బిజీగా ఉంది.
కపిల్ కోసం కపిల్ వద్ద
Related tags :