సుబ్బారెడ్డి తో పాటు 25మంది సభ్యులతో మరికొంత మంది ఆహ్వానితులుతో ఏర్పాటైన టిటిడీ భారీ బోర్డు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో దృష్టి పెట్టడంలేదని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భక్తులను ఏవిధంగా నిలువు దోపిడీ చేయాలి అనే విషయం పైనే టిటిడీ నూతన బోర్డు దృష్టి పెట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. భక్తులు విడిది చేస్తున్న కొన్ని వసతి సముదాయాలు లోని గదుల అద్దెను అమాంతం పెంచేసింది. పెంచిన ధరలను తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.తిరుమలలోని నందకం వసతి సముదాయంలోని గదులను 600 నుంచి ఏకంగా వేయి రూపాయలకు పెంచేసింది. అలాగే కౌస్తుభం, పాంచజన్యంలో రూ. 500 నుంచి వేయి రూపాయలుగా నిర్ణయించింది.ఇటీవలే శ్రీ వాణి ట్రస్ట్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం విఐపి బ్రేక్ దర్శన టికెట్ ను ఆన్ లైన్ విరాళం పేరుతో పరోక్షంగా రూ. 10 వేలకు పెంచిన విషయం తెలిసిందే.దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగానే అద్దె గదులు ధరలను అంతకు అంత పెంచడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది.
సుబ్బారెడ్డి… టిటిడీకి నిన్ను పంపించింది ఇందుకెనా!?
Related tags :