DailyDose

ఏసీబీ వలలో మహిళా తహశీల్దార్-నేరవార్తలు-11/08

ACB Arrests Lady Corrupt Tahsildar-Telugu Crime News Today-11/08

* కర్నూలు జిల్లా భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా గూడూరు తహసిల్దార్ హసీనా బి. గూడూరు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం తాసిల్దార్ హసీనా బి ని నెల క్రితం కార్యాలయంలో సంప్రదించాడు. అయితే భూ సమస్య పరిష్కారం కోసం తనకు రూ.4 లక్షలు లంచం గా ఇవ్వాలని తాసిల్దార్ డిమాండ్ చేశారు.
* భూ సమస్య పరిష్కారం కోసం రైతు నుంచి నాలుగు లక్షలు డిమాండ్ చేసిన గూడూరు తహసీల్దార్ షేక్ హసీనా
నిన్న రాత్రి గూడూరు కి చెందిన సురేష్ అనే వ్యక్తి నుంచి రూ 4 లక్షలు లంచం తీసుకున్న తహసీల్దార్ కి సంబంధించిన బినామీ వ్యక్తి ఉసేన్ఉసేన్ 4 లక్షలు డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులుతాను డైరెక్ట్ గా లంచం తీసుకోకుండా అమౌంట్ కలెక్షన్ కి బినామీ గా ఉసేన్ ని నియమించుకున్న తహసీల్దార్ హసీనాపరారీ లో గూడూరు తహసీల్దార్ షేక్ హసీనా..తహసీల్దార్ ఆచూకీ కోసం గాలింపు చేస్తున్న ఏసీబీ అధికారులుతాసిల్దార్ షేక్ హసీనాబి పై బినామీ వ్యక్తి ఉషేన్ భాష ఇద్దరి పై కేసునమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం.
* ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను సహించలేని పెద్దలు ఓ జంటను రాళ్లతో కొట్టిచంపారు. కర్నాటకలోని గదగ జిల్లా లక్కలకట్టిలో ఈ దారుణం జరిగింది.
*గనియా దేశంలో జరిగిన ఘోర దుర్ఘటన పదిమంది ప్రాణాలను పోట్టనబెట్టుకుంది ఇక్కడి ఈశాన్య ప్రాంతంలోని కొనర్కి సమీపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తు కుప్పకూలింది.
*అనంతపురం జిల్లా రొద్ధ మండలం బొక్కసంపల్లిలో చిరుతు కలకలం చోటుచేసుకుంది. బొక్కసంపల్లి ప్రాంతంలోని పొలాల్లోకి చిరుత సంచరించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. తమ పశువులపై చిరుత ఎక్కడ దాడి చేస్తుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
*దున్నురు గ్రామంలోని రెండు ఇళ్లల్లో గురువారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. మందస మండలం దున్నురు పంచాయితీ, దున్నురు గ్రామానికి చెందిన దున్న సోమయ్య, దున్న మెయిన్‌రావు ఇళ్లల్లో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది.
*అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో పాలయ్య, దివాకర్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
*భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు కర్నూలు జిల్లా గూడూరు తహసిల్దార్ హసీనాబీ. గూడూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ హసీనాబీని నెల క్రితం కార్యాలయంలో సంప్రదించాడు. అయితే భూ సమస్య పరిష్కారం కోసం తనకు రూ.4 లక్షలు లంచంగా ఇవ్వాలని తహసీల్దార్ డిమాండ్ చేశారు. దీంతో కలత చెందిన సురేష్ ఏసీబీని ఆశ్రయించాడు.
*కర్నూలు ఒక రైతు నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఓ తహసీల్దార్ అడ్డంగా దొరికిపోయింది. గూడూరు తహసీల్దార్‌ హసినాబీ ఆన్‌లైన్‌లో భూమి క్లియరెన్స్‌ కోసం… ఒక రైతును రూ. 8 లక్షలు డిమాండ్‌ చేసింది. ముందస్తుగా రైతు నుంచి రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
*చిత్తూరు జిల్లా కొరబలకోట మండలం చేనేతనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక కల్యాణమండపంలో వివాహానికి వచ్చిన చిన్నారి వర్షిత(6)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
*ఆత్మహత్యకు పురిగొల్పాయి. రెండు అంతస్థుల భవనం పై నుంచి బలవన్మరణానికి పాల్పడేలా చేశాయి. సమాజమే సిగ్గు పడేలా ఆ మహిళ సాగించిన అసహజ శృంగారం.. చివరికి భర్త ప్రాణాలనే బలితీసుకున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది.
*చిత్తూరు జిల్లాకురబలకోట మండలం అంగళ్ళ వద్ద చిన్నారి దారుణ హత్య…
*ప్రకాశం జిల్లా కనిగిరిమండలం, తాళ్లూరుకనిగిరి :టిక్‌టాక్ మరో ప్రాణాన్ని బలితీసుకుంది. వద్దన్నా టిక్‌టాక్ వీడియోలు చేస్తోందంటూ.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపుతోంది.
*అంబర్పేట డీడీ కాలనీలో గల శ్రీచైతన్య కళాశాలలోని ట్యాంక్లో బల్లిపడగా..ఆ నీరు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దవాఖానలకు తీసుకెళ్లారు.
*ఎర్రగడ్డ, చత్రపతి శివాజీ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.మాణిక్యం మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెలరోజులుగా ఈఎ్సఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
*భారీ హిమపాతం కారణంగా కశ్మీర్లో నలుగురు మృత్యువాత పడ్డారు. కశ్మీర్ లోయలోకి రాకపోకలు స్తంభించిపోయాయి. జమ్మూ-శ్రీనగర్ హైవే పూర్తిగా మూసివేశారు. దాదాపు 2 వేల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. శ్రీనగర్ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాలన్నీ రద్దయ్యాయి. గుల్మార్గ్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 62 సెంటీమీటర్ల హిమపాతం నమోదైంది. శ్రీనగర్లో 11 సెంటీమీటర్ల మంచు కురిసింది. 0.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది
*ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి అలజడి రేపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు 18 కి.మీ దూరంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జరిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ జవాను కంటా ప్రసాద్ మృతి చెందాడు.
*బీమా వైద్య సేవలు(ఐఎంఎస్) విభాగం కుంభకోణంలో భాగంగా వైద్య పరీక్ష కిట్ల సరఫరా పేరిట జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది
*మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) రవికుమార్ అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు అడ్డంగా దొరికిపోయాడు. ఓ పంచాయతీకి సంబంధించిన లెక్కలు సరిచేస్తానని మాజీ సర్పంచి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
*కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరులోని ప్రముఖ సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ నివాసంలో గురువారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట గ్రామీణ మండలం తీర ప్రాంత గ్రామమైన కొరిడి వద్ద గురువారం రాత్రి 8.20 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు పులికాట్ సరస్సులోకి దూసుకెళ్లింది.
*నిర్మాణ పనుల్లేక..కుటుంబాన్ని పోషించుకోలేక ఓ భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుకు చెందిన బొట్ల వెంకట్రావు(64) ఇదే మండలంలోని ఎండుగుంపాలెంలో స్థిరపడ్డారు.
*కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మెయిన్ బజారులో ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.2 కేజీల బంగారం, రూ.5.5 లక్షల నగదులు దుండగలు దోచుకున్నారు.