Health

ఎండలో తిరిగితే జెట్‌లాగ్ పోతుంది

Beat Jetlag By Roaming In The Sun

విమానంలో సుదూర ప్రయాణాలు చేసినప్పుడు.. వేర్వేరు టైమ్‌జోన్లలో ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో పగలు తర్వాత రాత్రి కాకుండా… పగలే రావొచ్ఛు లేదంటే సుదీర్ఘమైన రాత్రులు ఉండొచ్ఛు ఒక క్రమబద్ధమైన జీవగడియారానికి అలవాటైన మెదడు ఈ మార్పుని స్వీకరించడానికి కాస్త తటపటాయిస్తుంది. అదే జెట్‌లాగ్‌. దీనికి గురైన వారిలో కాళ్ల వాపులు, నిద్రలేమి కొన్నిసార్లు గుండెజబ్బులు కూడా రావొచ్ఛు అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
***జెట్‌లాగ్‌ఇలా దూరం
* విమానంలో పన్నెండు గంటలు దాటి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు.. ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలో, తర్వాత కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఇలాచేస్తే జెట్‌లాగ్‌ ఉండదు.
* ప్రయాణంలో ప్రతి రెండు గంటలకు ఒకసారైనా కూర్చున్న చోటు నుంచి లేచి అటూఇటూ నడవడం వల్ల రక్తప్రసరణ జరిగి తిమ్మిర్లు, కాళ్ల వాపులు వంటివి రాకుండా ఉంటాయి.
* భూమ్మీద నుంచి కొన్నివేల అడుగుల ఎత్తులో ప్రయాణం. దాంతో ఉష్ణోగ్రత మార్పులతోపాటు తేమ కూడా తగ్గుతుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. అందుకే మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ వంటివి రాసుకోవాలి. శరీరంలోని నీటిని పీల్చేసే టీ, కాఫీలు కాకుండా తేమను నిలిపి ఉంచే పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి. మద్యం, నిద్రమాత్రలకి పూర్తిగా దూరంగా ఉండాలి.
* చాలామంది ప్రయాణం తర్వాత జెట్‌లాగ్‌ నుంచి తప్పించుకోవడానికి నిద్రపోతే మంచిదని అనుకుంటారు కానీ.. వీలైనంత వరకూ ఎండలోకి వెళ్తే తిరిగి జీవగడియారాన్ని అనుసరించి మెదడు చురుగ్గా పనిచేయడం మొదలవుతుంది