పెరిగిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు, అక్రమ నిల్వలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విజిలెన్స్ అధికారులు గురువారం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలుచేశారు. 70 ఉల్లి వ్యాపార సముదాయాలపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. మొత్తం 47 చోట్ల ఉల్లి అక్రమ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. 10 చోట్ల వ్యాపారులు రూ.27 లక్షలకు పైగా విలువైన 603 క్వింటాళ్ల ఉల్లిని అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించారు. నిబంధనలకు అనుగుణంగా చెల్లించాల్సిన పన్నులు కూడా వ్యాపారులు చెల్లించడం లేదన్న విషయం సోదాల్లో బయటపడింది. స్టాక్ రిజిస్టర్లు నిర్వహించడంలేదని, క్రయవిక్రయాలకు ఎలాంటి బిల్లులు లేవని, మార్కెట్ సెస్ ఎగవేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు తనిఖీల్లో తేలింది. వ్యాపారులు మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచుతున్నట్టు బయటపడిందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
ఏపీలో అక్రమంగా ₹27లక్షల ఉల్లి నిల్వలు
Related tags :