Sports

2023 హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న భారతదేశం

India To Host 2023 Hockey World Cup

పురుషుల హాకీ ప్రపంచకప్‌-2023కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుందని ఇంటర్నేషనల్‌ హాకీ ఫెడరేషన్‌ ప్రకటించింది. 2022లో జరిగే మహిళా హాకీ ప్రపంచకప్‌ను స్పెయిన్, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నట్లు తెలిపింది. పురుషుల ప్రపంచకప్ 2023, జనవరి 13 నుంచి 19 వరకు, మహిళా మెగాటోర్నీ 2022 జులై 1-17 వరకు జరుగుతుంది. మ్యాచ్‌ల వేదికలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ప్రపంచకప్‌ అర్హత ప్రక్రియను విడుదల చేసింది. ఆతిథ్య జట్టు, కాంటినెంట్‌ ఛాంపియన్‌షిప్స్‌ (ఐదు జట్లు) ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన అనంతరం ర్యాంకులను బట్టి 20 జట్లను క్వాలిఫయిర్స్‌కు ఎంపిక చేస్తారు. మహిళా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌‌, ఫైనల్ స్పెయిన్‌లో నిర్వహిస్తారు. నాలుగు క్వార్టర్‌ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌‌, స్పెయిన్‌ చెరో రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది.