Health

ఎయిడ్స్ రోగుల్లో తెలంగాణా నెం1.ఏపీ నెం3.

Telangana Ranked No.1 In AIDS Patients. AP At No.3.

సెక్సువల్ ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి? అన్ సేఫ్సెక్స్ వల్ల వస్తాయి. కానీ.. షుగర్ కూడా అందుకు ప్రధాన కారణం కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు! సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చినోళ్ల కాలికి చిన్న గాయమైనా.. అంత ఈజీగా మానిపోదు. నిర్లక్ష్యం చేస్తే.. ఆ గాయం పెద్ద పుండై, చివరికి కాలునే తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు. వీళ్లకు అనేక రోగాల ముప్పూ ఎక్కువే ఉంటుంది. అయితే, మామూలు వ్యక్తులతో పోలిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నోళ్లకు లైంగిక వ్యాధుల ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ జనాభాలో దాదాపు15% నుంచి 20% మందికి షుగర్ వ్యాధి ఉందని, దీనివల్ల రాష్ట్రంలో లైంగిక వ్యాధుల ప్రమాదం కూడా చాలా ఎక్కువైందని అంటున్నారు.
**తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..
గత ఏడాది సెక్సువల్ ఇన్ఫెక్షన్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ఏపీ రెండో స్థానంలో ఉందని ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019’ రిపోర్ట్ వెల్లడించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్హెల్త్ ఇంటెలిజెన్స్ ఇటీవల విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, 2018లో తెలంగాణలోనే అత్యధికంగా14,940 మందికి సెక్సువల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్లు (సుఖ వ్యాధులు) వచ్చాయి. వీరిలో 4,824 మంది పురుషులు, 10,116 మంది స్త్రీలు ఉన్నారు. 2017లోనూ రాష్ట్రంలో 10,880 మంది లైంగిక వ్యాధుల బారినపడ్డారు. ఇక ఏపీలో గత ఏడాది12,484 మందికి సెక్సువల్ ఇన్ఫెక్షన్లు రాగా, వారిలో 3,197 మంది పురుషులు, 9,287 మంది స్త్రీలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల తర్వాత మధ్యప్రదేశ్ (8,140), కర్నాటక (3,685), రాజస్తాన్ (2,869) ఉన్నాయి.
** అన్ సేఫ్ సెక్స్, షుగర్ వ్యాధి వల్లే..
మన రాష్ట్రంలో అన్ సేఫ్సెక్స్, డయాబెటిస్ వల్లే సెక్సువల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తున్నాయని నేషనల్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది. రాష్ట్రంలో గత ఏడాది సిఫిలిస్, జెనిటల్ హెర్పిస్ వ్యాధులు కూడా విపరీతంగా వ్యాపించాయని పేర్కొంది. “లైంగిక వ్యాధులకు మొదటి కారణం అన్సేఫ్ సెక్స్. రాష్ట్రంలో మద్యపానం, అన్సేఫ్ సెక్స్ కారణంగా లైంగిక వ్యాధుల ముప్పు ఎప్పుడూ ఎక్కువే ఉంది. ఇటీవలికాలంలో వీటి బారిన పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది కూడా.నా దగ్గరకు వస్తున్నవాళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల వ్యాధుల బారినపడినవారే ఎక్కువగా ఉంటున్నారు” అని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆండ్రాలజిస్ట్, సెక్సాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి తెలిపారు. సెక్సువల్ ఇన్ఫెక్షన్ల వల్ల హెచ్ఐవీ ముప్పు కూడా 10 రెట్లు పెరుగుతోందని సిటీలోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వెల్లడించారు.రాష్ట్ర జనాభాలో దాదాపు15% నుంచి 20% మందికి షుగర్ వ్యాధి వచ్చినట్లు ఒక అంచనా ఉందని ఆయన తెలిపారు. అయితే, షుగర్ వ్యాధి సెక్సువల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని పెంచుతుందని, రాష్ట్రంలో లైంగిక వ్యాధుల పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం కావచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సెక్రటరీ, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.