అయోధ్య వివాదంపై సుప్రీం ఏకగ్రీవ తీర్పు
అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు.
మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు.
స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం.
ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులు.
వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే: సుప్రీం కోర్టు
అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే అని స్పష్టం చేసింది.
అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.
వివాదస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి: సుప్రీం
వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.
వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ అధీనంలో ఉంచాలి.
ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధివిధానాలపై 3 నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి: సుప్రీం
డిసెంబర్ 16, 1949 వరకు ముస్లింలు నమాజ్ చేసేవారు.
అలహాబాద్ హైకోర్టు ఉమ్మడి అధీనం కోసమే ఆదేశాలిచ్చింది.
మతపరమైన వివక్షకు రాజ్యాంగంలో స్థానం లేదు.
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి.
1956కు ముందు ఆ స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారు