భారత షూటర్ తేజస్విని సావంత్ వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్ మహిళా 50మీ రైఫిల్-3 పోటీలో పతకాన్ని సాధించకపోయినా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించింది. క్వాలిఫికేషన్‌లో 1171 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచిన ఆమె తుది సమరానికి అర్హత సాధించింది. కానీ, పతక పోరులో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఒలింపిక్స్‌కు తొలిసారిగా అర్హత సాధించింది. ఇప్పటివరకు భారత్ నుంచి 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. తేజస్విని 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో ఎన్నో పతకాలను గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్, ప్రపంచకప్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పసిడి సొంతం చేసుకుంది. 2010, మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది.
టొక్యో ఒలంపిక్స్‌కు భారత షూటర్ తేజస్విని

Related tags :