తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది.
నిన్న ట్యాంక్ బండ్ వద్ద మిలియమ్ మార్చి నిర్వహించిన కార్మికులు ఇవాళ అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపనున్నారు.
తమ 26 డిమాండ్ల సాధన కోసం 48వేల మంది కార్మికులు 36 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు.
ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి.