Movies

బాలకృష్ణ ఔదార్యం

Balakrishna Offers Free Cancer Treatment To Poor Girl Swapna From Anantapur

అనంతపురంకి చెందిన క్యాన్సర్ బాధితురాలు స్వప్నని బసవతారకం ఆసుపత్రిలో నేడు సినీనటుడు బాలకృష్ణ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసున్నారు. ఉచిత వైద్యం,ఆపరేషన్ పూర్తి అయ్యాక కృత్రిమ కాలు కూడా తానే అందిస్తానని హామీనిచ్చారు. వచ్చే నెల 20న విడుదల కానున్న తన నూతన సినిమా రూలర్ స్టిల్స్‌ను ఆమెకు బాలయ్య చూపించారు. స్వప్న నుదుటిపై ఆయన ఆప్యాయంగా ముద్దాడారు. ఆసుపత్రి వైద్యులు తనను కంటికి రెప్పలా బాగా చూసుకుంటున్నారు అని…బాలకృష్ణ సాయం మరవనని స్వప్న అన్నారు. బాలయ్య మాట్లాడుతూ ప్రతిభావంతురాలైన పేదింటి అమ్మాయి స్వప్న క్యాన్సర్ తో బాధపడుతూ…ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితితో ఇంట్లోనే ఉన్నారని తన అభిమానులు తెలిపానని, తన పరిధిలో ఆమెకు చేతనైన సాయం చేస్తానని బాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో బసవతారకం సీఈఓ ప్రభాకరరావు, డా.హరిత, హరికృష్ణ, వైద్యబృందం ఉన్నారు.