Health

సైకిల్ తొక్కండి. క్యాన్సర్‌ను నొక్కండి.

Biking Helps To Reduce Risk Of Cancer

బ్రెస్ట్ క్యాన్సర్ రోజురోజుకీ విస్తరిస్తున్న కారణంగా ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి కొంత సమయం సైక్లింగ్ చేయడం వల్ల ఈ వ్యాధి అడ్డుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎన్నో జబ్బులు దూరమవుతాయి. ఒక్కో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక్కో సమస్య దూరం అవుతుంది. తాజాగా సైక్లింగ్ గురించి మరో తాజా విషయం తెలిసింది. వారానికి కొంత సమయం సైక్లింగ్ చేయడం వల్ల క్యాన్సర్ను ఎదుర్కోవచ్చని పరిశోధకులు తెలిపారు. కొంతమంది పరిశోధకులు జరిపిన ఓ అధ్యయనంలో వారానికి 150 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల 30 శాతం మందికి క్యాన్సర్ను ఎదుర్కోగలిగినట్లు గుర్తించారు.
అంతేకాదు.. జబ్బు రాకముందే సైక్లింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుందని తేలింది. పదేళ్లుగా హైడెల్బెర్గ్లోని ‘జర్మనీ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్’కి చెందిన పరిశోధకులు రెండు వేల మందిపై పరిశోధన జరిపి, ఈ విషయాన్ని తేల్చారు. ‘బ్రెస్ట్ క్యాన్సర్, వ్యాయామానికి సంబంధం ఏమైనా ఉందా?’ అనే అంశంపై తొలిసారిగా అధ్యయనం జరిపిన పరిశోధకులు సరికొత్త విషయాలు తెలిపారు.
సైక్లింగ్ చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గడమే కాకుండా అనేక లాభాలు ఉన్నాయి.
**అవి..
సైక్లింగ్ అనేది కండరాలను దృఢపరుస్తుంది. దీనివల్ల ఫిట్గా ఉంటారు.
సైకిల్ తొక్కడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది.
రెగ్యులర్గా చేయడం వల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక సమస్యలు వంటివి చాలావరకూ దూరం అవుతాయి.కంప్యూటర్ వర్క్స్ ఎక్కువ చేసేవారిలో నడుము నొప్పి, వీపు నొప్పులు ఎదురవుతాయి. సైక్లింగ్ చేయడం వల్ల నరాలు లాగడం, వెన్నునొప్పి, పాదాలు, మడమల, కీళ్ల నొప్పులు, మెడనొప్పులు తగ్గుతాయి. కాబట్టి రెగ్యులర్గా సైక్లింగ్ చేస్తుండాలి.గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. బీపీ అదుపులో ఉంటుంది.సైక్లింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి పడదు. ఈ కారణంగా ఎలాంటి నొప్పులూ రావు.ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగై అజీర్ణ సమస్యలు ఎదురుకావు.రెగ్యులర్గా చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు.
స్త్రీలలో నెలసరి సమస్యలు, ఆ సమయంలో వచ్చే నొప్పులూ దూరమవుతాయి.సైక్లింగ్ చేయడం వల్ల కాలేయ సమస్యలు దూరం అవుతాయి.వీటిని చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు వాటిని దూరం చేసుకోవచ్చు.ఆరోగ్యం, శరీరాకృతి మెరుగవుతుంది. వెన్నెముక సక్రమంగా ఉంటుంది.
***సూచనలు..
రోజుకి ఇరవై నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే చాలు.. సైక్లింగ్ చేసేవారు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తే సరిపోతుంది.
సైకిల్ తొక్కడాన్ని ఒకేసారి ఆపొద్దు.. నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ ఆపేయాలి..
ఈ సమయంలో మరీ వర్కౌట్ చేసినప్పటిలా కాకుండా కాస్తా వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి.
దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మధ్యలో విరామం తీసుకోవద్దు.
సైక్లింగ్ చేసే సమయంలో మ్యూజిక్, సినిమా పాటలు వింటూ చేస్తుంటే బోర్ కొట్టకుండా ఎక్కువసేపు వర్కౌట్ చేసే వీలుంటుంది.సైక్లింగ్ ప్రారంభించే ముందే మన ఎత్తుకు తగ్గట్టు సీట్ని అడ్జెస్ట్ చేసుకోవాలి.రోజుకి కనీసం 15 నిమిషాల పాటు ఆపకుండా సైక్లింగ్ చేయాలి.వీపు, నడుము నిటారుగా ఉంచి సైక్లింగ్ చేయాలి.మధుమేహం ఉన్నవారు సైక్లింగ్ చేయకపోవడమే మంచిది.ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యుల సలహా మేరకే సైక్లింగ్ చేయాలి.