NRI-NRT

భారత పాస్‌పోర్టు సేవలన్నీ యాప్‌లోనే. తగ్గిన గిరాకీ.

Indian passport services in mobile app-Demand in slow decline.

పాస్ పోర్టు కు సంబంధించిన సేవలన్నీ ఇప్పుడు మొబైల్ యాప్లోనే పొందవచ్చు. పాస్ పోర్టుకు స్లాట్ కోసం దరఖాస్తు చేసుకొన్న తరువాత ఆ వివరాలతో అప్లికేషన్ రిఫరెన్స్ నంబరు (ఏఆర్ఎన్) ప్రింట్ కాపీ తీసుకురావాలన్న నిబంధననూ సడలించాం. మీ మొబైల్కు వచ్చే సందేశాన్ని చూపిస్తే సరిపోతుందిప్పుడు’’ అని విశాఖపట్నం ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం అధికారి ఎన్ఎల్పీ చౌదరి తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడారు. పాస్పోర్టుకు సంబంధించి వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
*డిమాండ్ బాగా తగ్గింది
గతంలో పాస్పోర్టుకు విపరీతమైన డిమాండ్ ఉండేదనీ, పోస్టాఫీసులతో కలిసి పాస్పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన తరువాత ఎక్కడి వారు అక్కడే దరఖాస్తు చేసుకొంటున్నారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో ఒకప్పుడు రోజుకు 1000 వరకు స్లాట్లు జారీ అయ్యేవన్నారు. ఇప్పుడు రోజుకు 450 చొప్పున ఇస్తుంటే… అందులోనూ మిగిలిపోతున్నాయని తెలిపారు. గతంలో స్లాట్ కోసం వారం రోజులు ఉండాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకొన్న మరుసటి రోజుకే స్లాట్ లభిస్తోందన్నారు. విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పరిధి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉందన్నారు. కొత్తగా శ్రీకాకుళం, విజయనగరం, ఎలమంచిలి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, భీమవరం ప్రాంతాల్లో పాస్పోర్టు సేవా కేంద్రాలు వచ్చాయని తెలిపారు. ఎక్కడ దరఖాస్తు చేసుకొన్న సేవల్లో తేడాలు లేవన్నారు. దరఖాస్తు చేసిన దగ్గర నుంచి వారం రోజులలోపే పాస్పోర్టు జారీ అయిపోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో తత్కాల్ సర్వీసుకు పూర్తిగా డిమాండ్ లేకుండా పోయిందన్నారు.
*నకిలీలతో జాగ్రత్త
పాస్పోర్టుకు సేవల కోసం విదేశీ మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ను passportindia.gov.in ఏర్పాటు చేసిందని, ఇది మాత్రమే అధికారికమైనదనీ, దీనికి రూ.1,500 ఫీజు చెల్లిస్తే సరిపోతుందని చౌదరి తెలిపారు. కొంతమంది నకిలీ వెబ్సైట్లు నడుపుతూ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని.. గూగుల్లో పాస్పోర్టు అని టైప్ చేయగానే ముందుగా నకిలీ వెబ్సైట్ల అడ్ర్సలే వస్తున్నాయన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కాకుండా ‘ఎంపా్సపోర్టు’ మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. నకిలీ వెబ్సైట్ల వివరాలు… passportindia.com, passport.org, passport.in
*ఎస్ఎంఎస్ చాలు
ఇంతకు ముందు స్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఆ వివరాలతో అప్లికేషన్ రిఫరెన్స్ నంబరు (ఏఆర్ఎన్) ప్రింట్ కాపీ తీసుకురావాలని నిబంధన ఉండేదన్నారు. దీనివల్ల దరఖాస్తుదారులు నెట్ సెంటర్కు వెళుతున్నారనీ వారు… ఒక్క ప్రింట్ కాపీకి రూ.200 నుంచి రూ.500 వసూలు చేస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. దాంతో ఆ నిబంధన సడలించామన్నారు. స్లాట్ తీసుకున్న వెంటనే దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబరుకు వివరాలతో ఎస్ఎంఎస్ పంపుతున్నామనీ, డాక్యుమెంట్లు సమర్పించడానికి వచ్చినపుడు ఆ ఎస్ఎంఎస్ చూపిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. పాస్పోర్టు సేవా కేంద్రాల నిర్వహణ బాధ్యత చూస్తున్న టీసీఎస్ సంస్థ పాస్పోర్టులకు కవర్లు కూడా తయారుచేసి విక్రయిస్తుస్తోందన్నారు. అయతే ఆ కవరు తీసుకోవడం తప్పనిసరి కాదని, నచ్చితే తీసుకోవచ్చని, లేదంటే తిరస్కరించవచ్చని స్పష్టం చేశారు.
*కొత్త డిజైన్తో పాస్పోర్టు పుస్తకాలు
ఇప్పటివరకు జారీ చేస్తున్న పాస్పోర్టు పుస్తకాలను మార్చి వాటి స్థానంలో సెక్యూరిటీతో కూడిన కొత్తరకం డిజైన్ పాస్పోర్టు పుస్తకాలను నవంబరు నుంచే ఇస్తున్నామని పాస్పోర్టు అధికారి ఎన్ఎల్పీ చౌదరి తెలిపారు. పాత పుస్తకంలో వ్యక్తి వివరాల కింద గీతలు ఉండేవనీ, కొత్త పుస్తకంలో అవేమీ ఉండవన్నారు. విమానాశ్రయాల్లో స్టాంపింగ్ చేసే లోపలి పేజీలు 4 గడులతో ఉండేవనీ, ఇప్పుడు పూర్తిగా ప్లెయిన్ పేజీలు ఉంటాయని తెలిపారు. విదేశీ పాస్పోర్టులను అనుకరిస్తూ కొత్తగా వీటిని రూపొందించారని తెలిపారు. పుస్తకాన్ని పేజీల వైపు పట్టుకొని చూస్తే ఇండియా అని ప్రింటింగ్ కనిపిస్తుందని వివరించారు. చిప్ పాస్పోర్టులు ఇంకా తయారీ దశలోనే ఉందన్నారు.