* అధికార భాజపాకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలను ఆ పార్టీ వెల్లడించింది. వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ.700కోట్లు అందాయని ప్రకటించింది. చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపుల రూపంలో ఈ మొత్తం సమకూరిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్ నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచే రావడం గమనార్హం. ఈ ట్రస్టు నుంచి రూ.356 కోట్లు సమకూరాయి. ఇక భారత్‌లో అత్యంత సంపన్న ట్రస్టు అయిన ‘ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచి రూ.54.25 కోట్ల విరాళాలు భాజపాకు అందాయి. భారతీ గ్రూప్, హీరో మోటార్‌కార్ప్, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, ఓరియెంట్ సిమెంట్, డీఎల్‌ఎఫ్, జేకే టైర్స్ లాంటి ఇతర కార్పొరేట్ సంస్థలు భాజపాకు విరాళాలు అందించిన వాటిలో ఉన్నాయి. రూ.20వేలు, అంతకు మించిన విరాళాలను కేవలం ఆన్‌లైన్‌లోనే స్వీకరించినట్లు భాజపా తెలిపింది. అయితే ఈ విరాళాల్లో ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన మొత్తాన్ని చేర్చకపోవడం గమనార్హం.
*అమరావతి భూములు రాజధానికి అనుకూలం కావు
ఏపీ రాజధాని అంశం పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స స్సత్యనర్యన అమరావతి భూములు రాజధానికి అనుకూలం కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో గత తెదేపా ప్రభుత్వం సమీకరించిన భూముల అభివృద్దికి ఎకరాకు రూ.కోటి ఖర్చు చేహరని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి ..అమరావతి అంశంపై మరోసారి స్పందించారు. రాజధానికి సంబందించిన నిర్మాణాలు పేరుతొ గత ప్రభుత్వం రూ.32వెల కోట్లతో కాంట్రాక్టు కు ఇచ్చింది అన్నారు. మంత్రి. ఈ నిధుల్ని లియా వుట్ల రోడ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసారని చెప్పారు.
* నవంబర్ 14 నుంచి నంబర్ 21 వరకూ ఇసుక వారోత్సవాలు:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
గతంలో సరాసరి ఇసుక డిమాండ్ 80వేల టన్నులు వరదలు కారణంగా, రీచ్‌లు మునిగిపోయిన కారణంగా… ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయాం: సీఎం• గత వారంరోజులుగా ఈ పరిస్థితి మెరుగుడు పడింది: సీఎం 1.20 లక్షల టన్నులకు రోజువారీ పెరిగింది: సీఎం రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90కిపైగా చేరింది: సీఎం 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారంరోజుల్లో పెంచాలి: సీఎం 137 నుంచి 180 వరకూ స్టాక్ పాయిట్లు పెంచాలి: సీఎం ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలి: సీఎం జేసీలను ఇన్‌ఛార్జీలు పెట్టాం కాబట్టి, వారు స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచాలి: సీఎం వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్ పాయింట్లు ఉండాలి: సీఎ నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి: సీఎం
*కేసీఆర్ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు: వీహెచ్
రైతు ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయని, సీఎం కేసీఆర్ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. రైతులకు సమస్యలుంటే 97049 37780 నెంబర్‌కు ఫోన్ చేయాలని, అండగా ఉండి పోరాడుతామని భరోసా ఇచ్చారు. రెవెన్యూ సమస్యలు తీవ్రం అవుతున్నాయని, రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయని, రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని పనులు చేయడం లేదని వీహెచ్ ఆరోపించారు.
*ఈ పరిస్థితి మరొకరికి రావొద్దు: అఖిలప్రియ
తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆరోపించారు. తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తన భర్తపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ పరిస్థితి మరొకరికి రావొద్దని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులపై గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఆ పార్టీ నేతలు కలిశారు. అఖిలప్రియ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అఖిలప్రియతో పాటు టీడీపీ నేతలు బృందం గవర్నర్‌ను కలిసింది.
*వర్నర్‌తో ముగిసిన పవన్ భేటీ
లిస్టు వదలమంటారా: విజయసాయికి బుద్ధా సవాల్
వైసీపీ, ఆ పార్టీ మంత్రి విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మంగళవారం ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర అంటే ఏంటి విజయసాయి రెడ్డి గారు? ట్రైన్లు తగులబెట్టడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పంటలు తగులబెట్టడం, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమా?’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని నరికేయండి, కాల్చేయండి, అని చొక్కా చించుకోవడమేనా? అని నిలదీశారు. ‘మీ ముఖ్యమంత్రిగారి చెత్త నిర్ణయాలతో ప్రజలు కడుపు మండి మాట్లాడుతుంటే వారు పెయిడ్ ఆర్టిస్టులని అవమాన పరుస్తారా? పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది మీ జగన్ గారే. జీతాలు చెల్లించి మరీ మీ ఆర్టిస్టులను ప్రజల మీదకి వదిలారు ఇప్పుడు వారందరికీ ప్రజా ధనం దోచిపెడుతున్నారు.ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ ముగిసింది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత, రాష్ట్రంలో ఉన్న ఇతర అంశాలపై గవర్నర్‌కు పవన్ వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్‌తో దాదాపుగా అరగంటకు పైగా చర్చించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరతపై పవన్, విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించారు. అయితే లాంగ్‌మార్చ్‌పై వైసీపీ నేతలు, పవన్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్, గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*ఇసుక సమస్యకు వైకాపా నేతలే కారణం: తెదేపా
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెదేపా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీయే కారణమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఇసుక మాఫియాలో వైకాపా నేతల పాత్ర ఉందని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందని దుయ్యబట్టారు. ఇసుక మాఫియాలో రాష్ట్రంలోని 67 మంది వైకాపా నేతల పాత్ర ఉందని వారు విమర్శించారు. అన్ని ఆధారాలతోనే ఛార్జిషీట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
*ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులా?: తెదేపా
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. మాజీ మంత్రి అఖిల ప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం అఖిల ప్రియ, తెదేపా నేతలు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అఖిల ప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. అక్రమంగా కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదని సూచించారు.
*గవర్నర్‌తో ముగిసిన పవన్ భేటీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ ముగిసింది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత, రాష్ట్రంలో ఉన్న ఇతర అంశాలపై గవర్నర్‌కు పవన్ వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్‌తో దాదాపుగా అరగంటకు పైగా చర్చించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరతపై పవన్, విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించారు. అయితే లాంగ్‌మార్చ్‌పై వైసీపీ నేతలు, పవన్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్, గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికైనా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఇస్తున్నారు. వారు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే సరికి.. ఆ సమయం గడిచిపోతుంది. అప్పుడు వెళ్లి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినా… ఆయన అవకాశం ఇవ్వడం లేదు. వరుసలో ఉన్న తర్వాతి పార్టీని పిలుస్తున్నారు. ఇప్పటికి అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని.. ఆ తర్వాత పెద్ద పార్టీగా ఉన్న శివసేనను పిలిచేసిన.. ఆయన తాజాగా ఎన్సీపీకి పిలుపు పంపారు. ఎన్సీపీ కూడా సాయంత్రంలోపు తేల్చకపోతే.. ఆ తర్వాత కాంగ్రెస్ ఒక్కటే మిగిలింది. కాంగ్రెస్‌ను పిలవకుండానే… కోషియరీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.
*ఖర్గేను సీఎం కానివ్వని సోనియా: దేవేగౌడ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రాకుండా సాక్షాత్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అడ్డుపడ్డారని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ తీవ్ర ఆరోపణ చేశారు. ఆయన సోమవారం కలబురగిలో విలేకరులతో మాట్లాడారు. మొన్నటికి మొన్న సంకీర్ణ సర్కారు కొలువుదీరేవేళ.. ఖర్గే పేరునే తాను సీఎం పదవికి ప్రతిపాదించానన్నారు. దీనికి కాంగ్రెస్ నుంచే వ్యతిరేకత వ్యక్తమైనందునే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ భవితవ్యం గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్, జనతాదళ్(ఎస్) పార్టీలు మరోసారి దగ్గరయ్యే అవకాశాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పారు.
*పీఆర్సీ పేరుతో కేసీఆర్ మైండ్గేమ్:వీహెచ్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగింపును ఖండిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. వారికి ఏం జరిగినా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాదే బాధ్యత అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిందంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడం విచారకరమని.. భాజపాను గెలిపించడానికే ఆయన మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేశారని వీహెచ్ ఎద్దేవా చేశారు.
*మన్మోహన్ కోసం దిగ్విజయ్ రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కొనసాగగా.. మన్మోహన్ సింగ్ కోసం ఆయన రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని, ఆర్థిక శాఖ మాజీ మంత్రి అయిన మన్మోహన్ సింగ్.. 2014 సెప్టెంబరు నుంచి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ఏడాది జూన్లో ఆయన రాజ్యసభ పదవి కాలం ముగియడంతో 2019 మే నెలలో కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను నామినేట్ చేశారు. ఇటీవల మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో మన్మోహన్ కోసం దిగ్విజయ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాజీనామా చేశారు.
*బాలాసాహేబ్ సేన టూ సోనియా సేన..!
మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను కమలనాథులు నిశితంగా గమనిస్తున్నారు. ఇంతకాలం తమకు మిత్రపక్షంగా ఉన్న శివసేన కాంగ్రెస్తో జతకట్టేందుకు చేస్తోన్న ప్రయత్నాలను తప్పుపడుతూ విమర్శలు ప్రారంభించారు. ఇందులో భాగంగా భాజపా జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ శివసేన వైఖరిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. శివసేన పరిణామక్రమం.. బాలాసాహేబ్ (బాల్ఠాక్రే) సేన నుంచి సోనియా సేనగా రూపాంతరం చెందుతోందని ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు, ఆపద్ధర్మ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నివాసంలో రాష్ట్ర భాజపా కీలక నేతలు రెండోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం.
*కాంగ్రెస్ తప్పిదాల వల్ల కేసీఆర్ సీఎం అయ్యారు
తెలంగాణలో పరిస్థితులు గమనిస్తుంటే అంతర్గత యుద్దం వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయాలకు ఎక్కడ లేని కళంకం తెచ్చారని విమర్శించారు. ఇలాంటి తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. భవిష్యత్తులో అలాంటి తప్పిదాలు జరగకూడదని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’లో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని దోపిడీకి తెర తీశారని ఆరోపించారు.
*మోదీ, కేసీఆర్లు నియంతల్లా మారారు
మోదీ, కేసీఆర్లు నియంతల్లా మారారని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.సుధాభాస్కర్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో ముగిసిన అంగన్వాడీ మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికోద్యమాలను అణచివేస్తున్నారని వాపోయారు. ఐసీడీఎస్ను ప్రైవేటీకరిస్తే సహించేదిలేదన్నారు.
టాటా నుండి భాజపాకి భారీ విరాళం-రాజకీయ-11/12
Related tags :