అలోవెరా(కలబంద) జ్యూస్ యొక్క ఆరోగ్యప్రయోజనాలు అలోవెరా, ఒక చిక్కగా జెల్ గా ఉండే ఒక పదార్థం. అలోవెరా (కలబంద)ను కాలినగాయాలకు, తెగిన గాయాలకు మరియు చర్మ ఇన్ఫెక్షన్లకు అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా జెల్ ల్లో అనేక న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్, మినిరల్స్ ఇవి శరీరానికి ఎంత అవసరం అయిన వాటితో నిండి ఉంది. అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. ఈ అలోవెరా జెల్ శరీర బాహ్య పరిస్థితులకు స్వీకృతి పెంచడం ద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అలోవెరా జెల్ శరీరానికి పోషకాలను మరియు శరీరానికి అవసరం అయ్యే వాటిని జతచేస్తుంది.
కలబంద రసంతో…అందం అమోఘం
Related tags :