ఏంటీ టైటిల్ చూసి కంగారు పడుతున్నారా.? ఒకసారి ఈ వార్త చదవండీ.. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మన భారతదేశంలో ప్రదేశాలు ఎన్నైనా.. అందరూ ప్రధానంగా తీసుకునే ఆహారం అన్నం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదే ప్రధాన వంటకం అని తెలిసిందే. అయితే పోలిష్ చేయని అన్నాన్ని తీసుకుంటే ఏం కాదు కానీ… పోలిష్ చేసిన అన్నం తింటే మాత్రం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పుడు దొరికే బియ్యం మొత్తం పోలిష్ చేసినవే. ఆ బియ్యాన్నే మనం తింటున్నాం. మరోవైపు పాలిష్ చేసిన బియ్యాన్ని తౌడు అంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తౌడునే మనం రోజూ తింటున్నాం. బియ్యం మెరవడానికి మిల్లుల్లో వాటిని బాగా పోలిష్ చేస్తారు. అలా చేయడం వల్ల బియ్యం పోషక పదార్ధాలను కోల్పోతుంది. ఇక ఆ ఉత్త బియ్యం తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దరికి చేరుతాయి. ఉత్త బియ్యంలో అధిక శాతంలో చక్కెర ఉంటుంది. అది మన బాడీలోకి గ్లూకోజ్‌గా చేరి.. షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఇక ఈ వైట్ రైస్‌కు కూల్ డ్రింక్‌కు మధ్య సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఒక చిన్న కూల్ డ్రింక్‌లో ఉండే చక్కెర కంటెంట్ కన్నా ఒక్క గిన్నెడు అన్నంలో ఉండే చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే కూల్ డ్రింక్ కంటే తెల్ల అన్నం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత వైట్ రైస్ కంటే.. బ్రౌన్ రైస్ లేదా దొడ్డు బియ్యం తినడం మంచిదని వారు సూచన. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడానికి, స్థూలకాయం తగ్గడం కోసం డాక్టర్లు ఎక్కువగా బ్రౌన్ రైస్ తినమని సలహా ఇస్తుంటారు.
https://www.youtube.com/watch?v=FrRSCzL_LUc
శీతల పానీయాల కన్న తెల్లన్నం ప్రమాదకారి
Related tags :