DailyDose

తహసిల్దారుపై పెట్రోల్ దాడికి ప్రయత్నం-నేరవార్తలు-11/13

Petrol Attack Attempt On MRO-Telugu Crime News Today-11/13-తహసిల్దారుపై పెట్రోల్ దాడికి ప్రయత్నం-నేరవార్తలు-11/13

* ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్.ప్రేట్రోల్ తో తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చిన మహిళ మరో వ్యక్తి.
కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ నెంబర్, మరియు పాస్ బుక్ ఇవ్వటం లేదని ఆవేదన.దీనిపై స్పందించిన మహిళ ఇతరులపై పోలీసులు అడ్డుకున్నారు.
*తెలంగాణ రాష్ట్రంలో నేరాలు తగ్గినట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తుండటం, నిఘాను పెంపొందించడంతో వ్యవస్థీకృత నేరాలు అదుపులోకి వచ్చినట్టు స్పష్టమవుతున్నది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2015లో తెలంగాణలో మొత్తం 1,22,778 కేసులు నమోదుకాగా.. 2016లో వీటి సంఖ్య 1,20,273కు తగ్గింది. ఇదే సమయంలో కేరళలో కేసుల సం ఖ్య 6,53,408 నుంచి 7,07,870కు, ఉత్తరప్రదేశ్‌లో 4,74,559 నుంచి 4,94,025కు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. మన హైదరాబాద్ సేఫ్ దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉన్నది. దేశంలోనే అతితక్కువ క్రైంరేట్(2.7శాతం)తో హైదరాబాద్ సురక్షిత నగరంగా నిలిచింది. నాగ్‌పూర్, కోయంబత్తూరు లాంటి పట్టణాల కంటే హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరమని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2015-17 మధ్య హైదరాబాద్‌లో నేరాలు 14 శాతం తగ్గాయి. ఇదే సమయంలో ఢిల్లీలో 40.4 శాతం, బెంగళూరులో 8.9 శాతం, ముంబైలో 7.2 శాతం, చెన్నైలో 3.6 శాతం చొప్పున నేరాలు పెరుగడం గమనార్హం. ప్రత్యేకించి మహిళల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. షీ టీమ్స్, షీ షటిల్, ప్రత్యేక తనిఖీ బృందాల నిఘాతో హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు 13.5 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గినట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఉమెన్ సేఫ్టీవింగ్‌ను ఏర్పాటుచేసి ఐజీ ర్యాంకు అధికారిని ప్రత్యేకంగా నియమించడంతో మహిళల్లో భరోసా పెరుగుతున్నది. పని ప్రదేశాల్లో జరిగే లైంగికదాడులపై వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. 2016లో 24 శాతం మంది ఇలాంటి ఫిర్యాదులు చేయగా.. 2017లో ఇది 30 శాతానికి పెరిగింది.
* నాదెండ్ల మండలం కనపర్రులో గుండె పోటుతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు బూర్సు ప్రసాద్ మృతదేహానికి నివాళి అర్పించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
* దగదర్తి ఎస్.ఐ వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త కార్తీక్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్య. ఎస్సై పై ఆరోపణలు చేస్తున్న కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు‌ చెప్పినట్టు నడుచుకోవాలంటూ ఎస్.ఐ వేధించారని, తమ హోటల్ కూడా తొలగించారని కుటుంబ సభ్యులు ఆవేదన‌.
* పెరవలి మండలం ఖండవల్లి జాతీయ రహదారిపై కావేరి బస్సు బోల్తాఖండవల్లి రహదారి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఒక్కసారిగా బస్సుకు అడ్డంగా వచ్చిన టీవీస్50 మోటారు వాహనం
* మహిళా కానిస్టేబుల్‌ను వెంబడిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళాకానిస్టేబుల్ (34), ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి రూపేశ్‌కుమార్ కు పోస్టింగ్ వచ్చింది.
* ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి.ఇవాళ ఉదయం 7:25 గంటలకు జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
* పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహామ్‌ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయురాలు రెహామ్‌ఖాన్‌పై 2018 జూన్ నెలలో దునియా టీవీ ‘ఆన్ ది ఫ్రంట్ విత్ కమ్రాన్ షాహిద్’ పేరుతో ఓ కార్యక్రమం ప్రసారం చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని ప్రస్తుత రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ ఇమ్రాన్ మాజీ భార్య రెహమాన్‌ఖాన్‌పై తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేశారు. పాక్ మంత్రి చేసిన ఆరోపణలపై రెహామ్ ఖాన్‌ పరువుకు భంగం వాటిల్లినందున పాకిస్తాన్ న్యూస్ ఛానల్ క్షమాపణలు చెప్పింది.సోమవారం లండన్‌లోని హైకోర్టులో జరిగిన విచారణలో జస్టిస్ మాథ్యూ‌ నిక్లిన్‌ ఈ తీర్పు వెలువరించారు.దునియా టీవీ మా క్లయింట్‌కి బహిరంగ క్షమాపణ చెప్పిందని జస్టిస్ పేర్కొన్నారు.జడ్జి ఆదేశాలతో నష్టపరిహారంతోపాటు కోర్టు ఖర్చుల్ని భరిస్తామని దునియా టవీ పేర్కొంది.
* హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను మెడపై నరికి దారుణంగా హతమార్చారు.
* తెలంగాణ మార్కెట్‌లో అక్రమంగా విక్రయించడానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన వడ్ల లోడ్ లారీని అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కందకుర్తి చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది.
* ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను 2011లో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో 24 నవంబర్,2011న ఓ కార్యక్రమానికి హాజరైన శరద్ పవార్‌ను అర్విందర్ సింగ్(36) అనే వ్యక్తి చెంప దెబ్బ కొట్టాడు. శరద్ పవార్‌ను చెంపదెబ్బ కొట్టడంపై తానేమి చింతించడం లేదన్నాడు. ఇది చాలా చిన్న చర్యగా భావిస్తున్నట్లు తెలిపాడు. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఊరేగుతుంటే పాలకులు చలనం లేకుండా పడిఉన్నారన్నారు. ఈ దేశ రాజకీయ నాయకుల నిర్లక్ష్య పాలనకు ప్రతి సామాన్యుడు చేయాలనుకున్న పని ఇదేనని పేర్కొన్నాడు.
* ఓ జంట డిన్నర్‌ చేసే నిమిత్తం రెస్టారెంట్‌కు వెళ్లింది. కాగా ఆరుగురు వ్యక్తులతో కూడిన గుంపు రెస్టారెంట్‌లో దంపతులను టార్గెట్‌ చేశారు. భార్యను దుర్భాషలాడుతుండగా అడ్డుకునే యత్నం చేసిన భర్త తలపై మందు సీసాతో దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీకి నైరుతిగా ఉన్న గుర్‌గావ్‌లో గడిచిన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
* పెగడపల్లి మండలం దోమలకుంటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కన్న కొడుకును తండ్రి హతమార్చిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
* ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇవాళ ఉదయం 7:25 గంటలకు జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు.
* కేరళలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాల్‌కులంగరకు సమీపంలోని ఓ ఇంటి ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పిల్లికి ఉరివేశారు. వినోద కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన క్లబ్ ఎదుట ఈ దారుణం వెలుగుచూసింది.
* గొర్రెలు మేపుకుంటున్న యువతిపై దాడి చేసిన దుండగులు గొంతు కోసి దారుణంగా హత్యచేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లింగనహళ్లిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
*విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బంగ్లాదేశ్ కు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వెన్మొనిలో రెండు హత్యలు చేసి పరారవుతున్న లబులు, జ్యువెల్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
*కూతురి పెళ్లి విషయంలో మాట తప్పాననే మనోవేదన ఓ తండ్రి బలవన్మరణానికి దారి తీసిన విషాద ఘటన మంగళవారం రాయలచెరువు చెరువులో చోటుచేసుకుంది.
*తెగిపోయి వచ్చిన పతంగిని పట్టుకోవడానికి వెళ్లి భవనం మూడో అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మార్కెట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
*పందుల బారి నుంచి పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఇద్దరి పాలిట మృత్యుపాశమైంది. వేటకు వెళ్లిన బావ, బావమరిది ఇద్దరు మృతి చెందిన ఘటన నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో మంగళవారం జరిగింది.
*ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
*కలకాలం కలిసి జీవించాల్సిన భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో, కోపంతో రగిలిపోయిన భర్త, తనను తాను అదుపు చేసుకోలేక భార్యను తలపై బలంగా బాది, హత్య చేశాడు. ఈ ఘటన దుండిగల్ పరిధిలోని సూరారంలో జరిగింది.
*బంగ్లాదేశ్లోని బ్రమన్భారియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు మంగళవారం ఢీకొనడంతో 16మంది మృతి చెందారు. మరో 60మంది గాయపడ్డారు.
*ఆదాయ పన్నుశాఖ అధికారులు హైదరాబాద్, విశాఖపట్నంలలోని రెండు సంస్థల్లో చేపట్టిన సోదాలు మంగళవారం ముగిశాయి. హైదరాబాద్లో ఉన్న ట్రెండ్ సెట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నంలో అవంతి ఫీడ్స్ సంస్థల కార్యాలయాల్లో గురువారం నుంచి సోదా మొదలుపెట్టారు.
*కాంబోడియా నుంచి చెన్నై హార్బర్కు అక్రమంగా తీసుకొచ్చిన రూ.7 కోట్ల విలువైన సిగరెట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెస అధికారులు తెలిపారు.
*లంచం తీసుకున్న ఆరోపణ రుజువు కావటంతో కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్కు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 20వేల జరిమానా విధిస్తూ సీబీఐ కేసుల ఒకటో అదనపు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్.రమేష్బాబు తీర్పునిచ్చారు.
*కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా కుమారుడు అబీర్ లవాసాపై, ఆయనకు సంబంధించిన సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అశోక్ డైరెక్టర్గా ఉన్న ‘నరిష్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రై.లి.’ సంస్థ మారిషస్ నుంచి రూ.7.25 కోట్ల నిధుల్ని పొందే విషయంలో ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించిందో లేదో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు ఈడీ మంగళవారం తెలిపింది.
*మస్కట్లోని సీబ్ ప్రాంతంలో నీటి పైపులైన్ నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు భారతీయులు మృతి చెందారు.
*గతంలో ఇచ్చిన ఇంటి స్థలం పట్టాను రద్దు చేయడంపై మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకుని తహసీల్దారు ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
*జమ్మూ-కశ్మీర్లోని దోడా జిల్లాలో ఒక వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 16మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బటోటే-దోడా జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఒక మలుపు వద్ద ఈ వాహనం అదుపు తప్పి 500 అడుగుల లోతు లోయలోకి జారి పోయింది.
*పాత రద్దయిన నోట్లు మారుస్తామని నమ్మబలుకుతూ మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వెంకటేశ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
*కన్న తండ్రే బిడ్డలను చిత్రహింసలకు గురిచేస్తున్న అమానుష సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సారవలో వెలుగు చూసింది.
*ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
*జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడటంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు.
*సికింద్రాబాద్ మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది.
* దక్షిణ కశ్మీర్‌లో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో ఓ షాపు యజమానిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షాపు యజమాని మిరాజ్-ఉద్-దిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.