DailyDose

సుబ్బారెడ్డి మళ్ళీ భక్తులపై పడుతున్నాడు-తాజావార్తలు-11/13

TTD Chairman YV Subbareddy Getting Ready For Another Blow To Devotees-Telugu Breaking News Today-11/13

*తితిదే మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై స్వామివారి లడ్డూను అధిక ధరకు విక్రయించాలన్న ఆలోచనలో టిటిడీ ఉన్నట్లు సమాచారం. లడ్డూ పంపిణీ, విక్రయాల్లో రాయితీలు అన్నింటిని రద్దు చేయాలని తితిదే ప్రణాళికలు సిద్దం చేస్తుంది.
* సుప్రీం కోర్టు మరో చారిత్రక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం… సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది.
* సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది.
* ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. సమ్మె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.
* పీ మంత్రి వర్గం నేడు అమరావతిలోని సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. రైతులు నష్టపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడతామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
తెలుగు భాషను విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోక తప్పదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు.
* శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా తదితరులు ఈ ధర్మాసనంలో ఉన్నారు. కాగా అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడంపైనా సుప్రీం తీర్పును స్వాగతించాలంటూ కేరళ దేవస్వోం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఇప్పటికే బీజేపీ నేతలను కోరారు.
* రాజధానిలో వాయు కాలుష్యం పెరగడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీ వాయు కాలుష్యంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌.. హైడ్రోజన్‌ ఇంధన ఆధారత వాహానాల టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు.
* గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. భద్రాచలం లోని బ్రిడ్జి సెంటరు వద్ద ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి బుధవారం జిల్లాకు వచ్చారు.బ్రిడ్జి సెంటర్ వద్ద మంత్రిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకుని మంత్రిని అక్కడి నుంచి పంపించేశారు.
* క్స్ సదస్సుకు హాజరయ్యేందుకు బ్రెజిల్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ దేశ రాజధాని బ్రెసీలియా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సదస్సులో భాగంగా బ్రిక్స్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు ప్రధాని.
* టిటిడి విజిలెన్స్ అదుపులో మరో ఉద్యోగి … ఎన్నారై కోటాలో అక్రమంగా ముగ్గురు భక్తులును దర్శనానికి అనుమతిస్తూ పట్టుబడ్డ సినియర్ అసిస్టెంట్ ఉద్యోగి. విచారణ జరుపుతున్న విజిలేన్స్ అధికారులు.
*కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
*నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ పదోవతరగతి ,ఇంటర్ ప్రేవేసానికి అడ్మిషన్ ఫీజు గడువును అపరాధ రుసుముతో ఈనెల 16 వరకు పొడిగించారని జిల్లా కో ఆర్డినేటర్ రమణారెడ్డి తెలిపారు
*రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందిబడిని, గుడిని వదలని వైసీపీ వాళ్ళు, అవకాశం వుంటే ఇసుకకి, ఇంద్రధనస్సు కి వైసీపీ రంగులు వేసేలా వున్నారుఅన్నవరంలో అన్యమత ప్రచారం, ఐలాండ్ లో అర్చిల పై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టల్స్ ఏర్పాటు, వైసీపీ మత వ్యాప్తి నీ సూచిస్తుంది.
*ఒడిశా రాష్ట్రం కటక్ నగరంలోని మహానది ఒడ్డున బాలియాత్ర ఫెస్టివల్ ప్రారంభమైంది. పురాతన సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బాలియాత్ర ఫెస్టివల్ నిర్వహించారు. ఇండోనేషియా రాయబారి సిద్ధార్దో రెజా ముఖ్యఅతిధిగా పాల్గొన్న బాలియాత్ర ఫెస్టివల్ ను ఒడిశా రాష్ట్ర స్పీకర్ ఎస్ఎన్ పాత్రో ప్రారంభించారు.
*శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
*పిడుగురాళ్ళ పట్టణంలో ఐపీల కలకలం(కుచ్చుటోపీ)ఐపి పెట్టిన పట్టణంలోని ధనలక్ష్మి జ్యూయలరీ షాపు యజమాని కాశీరామ్
ముప్పై కోట్లకు టోకరా.. ఆందోనలో బాదితులు చిన ముంబాయిగా పేరుగాంచిన పిడుగురాళ్ళలో గత నాలుగు నెలలుగా వరుసగా పదిమంది ఐపీలు, త్వరలో మరి కొందరు మాయమయ్యే అవకాశం ఉందంటున్న ప్రజలు..
*కదిరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేయుచున్న డిప్యూటీ తహసీల్దార్ కె.శ్రీధర్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణకార్యాలయపు పనికి సంబంధించి మధ్యవర్తితో లంచం విషయం మాట్లాడుతున్న విషయం టీవీ5 మరియు సోషల్ మీడియా లో ప్రసారమైన సందర్భంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్..
*గ్రూపు-1 ప్రధాన పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16 మధ్య జరుగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎస్.ఆర్.ఆంజనేయులు మంగళవారం ఓ ప్రకటన జారీచేశారు. తొలుత డిసెంబరు 12 నుంచి 23 మధ్య ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడిలో జాప్యం వల్ల పరీక్షల సన్నద్ధతకు సమయం సరిపోవడం లేదని, వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయగా ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
*పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ (పీహెచ్ఈపీ) ఒప్పందం రద్దు విషయంలో కారణాలు ఎందుకు చెప్పలేదని ఏపీజెన్కోను హైకోర్టు ప్రశ్నించింది. ఫలానా నిబంధనలను ఉల్లంఘించారు? ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నవయుగ సంస్థను సంజాయిషీ కోరి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.
*సింగరేణి పరిధి జిల్లాలలో ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు సింగరేణి కాలరీస్ కంపెనీకి విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రాంత ఎమ్యెల్యేలు, ఎంపీలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సమీక్ష జరిపారు. అభివృద్ధి పనులకు కేటాయించిన రూ.2 వేల కోట్లకుతోడు ప్రతి నియోజకవర్గానికి అదనంగా రూ.2 కోట్లు ఇవ్వాలని వారు కోరగా వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంస్థ సీఎండీ శ్రీధర్ సూచించారు.
*ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తాజాగా ప్రాసిక్యూషన్ నోటీసు జారీ చేసింది. ఉమ్మడి ఆర్టీసీ విభజన తర్వాత తెలంగాణ కార్మికులకు ప్రత్యేక కోడ్ సంఖ్యను కేటాయించకపోవడం, కార్మికులకు పీఎఫ్ చెల్లించకపోవడం, కార్మికుల వాటాను జమ చేయకపోవడం, పీఎఫ్ పథకాన్ని అమలు చేయకపోవడం తదితర అంశాలపై సంజాయిషీ కోరింది.
*పత్రికా రంగంలో రాఘవాచారి చేసిన కృషికి గుర్తింపుగా ఏపీ ప్రెస్ అకాడమీకి ఆయన పేరు పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విశాలాంధ్ర పూర్వ సంపా దకుడు సి.రాఘవాచారి సంస్మరణసభలో అమర్ మాట్లాడారు.
*తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం వల్ల చలి పెరుగుతోంది. మంగళవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి 15.5, మెదక్లో 16.8, ఆదిలాబాద్లో 17.8, హైదరాబాద్లో 20.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. చలి ఇంకా పెరిగే సూచనలున్నాయి.
*పాడి పశువులను నమ్ముకొని బతుకీడుస్తున్న రైతులకు పశువైద్యం తలకు మించిన భారంలా మారింది. పశువైద్యశాలల్లో మందులు లేక, ప్రైవేటులో అధిక ధరలకు కొనక తప్పడం లేదు. ఈ ఏడాది జూన్ తరువాత రాష్ట్రంలోని పశువైద్యశాలలకు మందులు సరఫరా కాలేదు.
* లంచం తీసుకోకూడదని దైవ సాక్షిగా, పవిత్ర గ్రంధాల సాక్షిగా రాయచోటి మున్సిపల్ అధికారులు, సిబ్బందిచే ప్రమాణం చేయించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి….