ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవినేని అవినాష్
జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నచ్చి వైయస్సార్సీపీలో చేరాను : అవినాష్
సంక్షేమ పధకాల అమల్లో భాగస్వామ్యం కావాలని పార్టీలో చేరా : అవినాష్
ముఖ్యమంత్రి వైయస్.జగన్ నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచనతోనే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రారంభించారో ఆ పథకాలే పార్టీలో చేరేలా తనను ప్రోత్సహించాయని ఆయన స్పష్టం చేశారు. ఆయన కష్టంలో సైనికుల్లా పనిచేయాలన్న ఆలోచనతోనే ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు కడియాల బుచ్చిబాబు, నలభై యేళ్లుగా దేవినేని నెహ్రూతో కలిసి ప్రయాణించిన వారందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. దేవినేని నెహ్రూతో ఉన్న అనుబంధంతో ఇవాళ మాకు సహకరించిన పెద్దలు సుబ్బారెడ్డి, సాయిరెడ్డి నన్ను వాళ్ల కుమారుడిగా భావించి అక్కున జేర్చుకున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తామందరం కష్టపడతామని చెప్పారు.