శ్రీశైలం గేట్లన్నీ మూసివేశారు. ఈ వర్షాకాలంలో ఆగస్టు నుంచి కురిసిన వర్షాలతో ఏడోసారిగా గేట్లు తెరిచిన అధికారులు నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. కాగా ఇప్పటి వరకూ వచ్చిన వరదతో ప్రాజెక్టు నీటి మట్టాలు మాత్రం గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885అడుగులు కాగా గురువారం నాటికి 883అడుగులకు చేరుకున్నది. అలాగే 215 టీఎంసీల నీటి నిల్వకు గాను 205 టీఎంసీల స్థాయిలో ఉన్నది. ఇక జూరాల నుంచి కేవలం 11,925 క్యూసెక్కులు వస్తుండగా సుంకేసుల నుంచి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. కాగా ప్రాజెక్టు అన్ని గేట్లు మూతబడగా కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి మాత్రం విద్యుదుత్పత్తి నిరంతరాయంగా సాగుతున్నది. దీనికిగాను కేవలం 43వేల క్యూసెక్కుల నీళ్లు బయటకు వెళ్తున్నాయి.
శ్రీశైలం గేట్లన్నీ మూసివేశారు
Related tags :