Politics

చంద్రబాబుకు ఓటు-నోటు కేసు భయం. అందుకే ఆర్టీసీపై నోరు మెదపట్లేదు

Vallabhaneni Vamsi Fires On Chandrababu And TDP

గన్నవరం ఎమ్మెల్యే వంశీ:-

45 ఏళ్ళు రాజకీయం చేసిన చంద్రబాబు అప్పుడే ఆగలేక ఆందోళనలు చేస్తున్నారు

చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక పోతున్నారు

గత ప్రభుత్వ హయాంలో అప్పుడు మా ప్రభుత్వం రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ ఎంత సమయం తర్వాత చేసమో తెలుసుకోవాలి

ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు

ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి

వరదల సమయంలో ఇసుకను తవ్వే టెక్నాలజీ చంద్రబాబు కనుక్కోవాలి

అధికారం లేదని ఇలా ఉద్యమాలు చేయటం సరికాదు

మంచి పని చేస్తే ఆ ప్రభుత్వాన్ని సమర్దించాలి

ఇంగ్లీష్ మీడియం పై కొత్త ప్రభుత్వ ఆలోచన విధానం బాగుంది

ప్రభుత్వాన్ని సమర్దిస్తున్నా

టీడీపీ ప్రాంతీయ పార్టీగా ఉన్న జాతీయ పార్టీగా మారింది

ఎన్నికల సమయంలో.ఒక పార్టీ తో పొత్తు , ఎన్నికల తర్వాత వేరే పార్టీతొ పొత్తు వల్ల ప్రజలో చులకన భావం

జగన్ తో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది

గతంలో వైఎస్ హయాంలో టీడీపీ కంపెనీలు మూసేస్తే సాయం చేశారు

జగన్ జైల్లో ఉన్న కలవలేదు

జగన్ మంచి పని చేస్తున్నారు కాబట్టి ఆయన్ని సమర్దిస్తున్నా

చంద్రబాబుకి జ్ఞానం ప్రసాదించాలని దేవుడ్ని కోరుతున్నా

టీడీపీ టైటానిక్ షిప్ మాదిరి ఉంది

ఎవరి మాట వినకపోతే మునిగిపోద్ది

జగన్ కు మద్దతు పలికితే నాకు ఏం ఉపయోగం లేదు

నాకు కేసులు ఉన్నా ఇబ్బంది లేదు

రాజకీయాల్లోకి రాకముందే ఇవన్ని చూసా

నాకు ఆర్థిక ఇబ్బందులు కుడా లేవు

అవసరం అయితే ప్రజల మంచి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ప్రజల కోసం పని చేస్తా

జూనియర్ ఎన్టీఆర్ గురించి వంశీ:-

పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారు

జూనియర్ పార్టీ కోసం పని చేస్తే పక్కన పెట్టారు

సుజనా చౌదరి వద్దన్నా కూడా కేంద్రంపై కొందరిమాటలు విని ధర్మ పోరాటం చేశారు

చంద్రబాబు ఓటుకు నోటు కేసు వల్లే తెలంగాణ లో ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనటం లేదు.

పవన్ గొంతు ఏపీ లొనే ప్రశ్నిస్తోంది, తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు అడిగిన ఆయన పోరాటం చేయరట

ఎన్టీఆర్ అనంతరం టీడీపీ ఏనాడు పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవలేదు

అనేక వెబ్ సైట్లు మా చినబాబు మెయిన్టెన్ చేస్తున్నారు..

వర్దంతికి జయంతి తేడా తెలియని వాళ్లు కూడా నాపై ఆర్టికల్స్ రాపిస్తున్నారు..

బ్లాక్ మెయిల్ చేసి నన్ను పార్టీలో ఉంచాలని అనుకుంటున్నారా..

నాపై తప్పుడు కేసులు పెడితే టీడీపీ పట్టించుకోలేదు..

ఎమ్మెల్యే అంటే నాకు పెద్ద పదవేకాదు..

జగన్ కు మద్దతు తెలుపుదామనుకున్నాను..తెలుపుతున్నాను.. టెక్నికల్ ఎలా వెళ్లాలో ఆలోచిస్తాను..

రాజకీయాలనుండి తప్పుకుందామనే అనుకున్నా..ప్రజలు ,కార్యకర్తలు ఆపారు

ఉమా లాంటి అనేకమంది నేతలతో విసిగిపోయా…

నాకు టికెట్ ఇచ్చి గెలిపించామంటున్నారు మరి లోకేష్ ను గెలిపించుకోలేకొయారే..

అతి త్వరలో వైసీపీలో చేరుతాను

చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీలో వద్దామనుకున్నారు.. వారి ద్వారాలు తెరవలేదు.