*కర్ణాటకలో నంబర్ గేమ్ ఆసక్తిదాయకంగా మారింది. డిసెంబరు ఐడో తేదీన కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుబోతున్నాయి. మొత్తం పదిహేను స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రస్తుత బలాబలాలు నేపద్యంలో కనీసం ఆరు సీట్లలో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా గెలవాల్సిన ఉంది. పదిహేనులో కనీసం ఆరు సీట్లను గనుక నెగ్గలేక పొతే భాజాపా ప్రభుత్వం కర్ణాటకలో పడిపోయే అవకాశాలున్నాయి. పూర్తీ స్థాయి మెజార్టీ లేకుండానే కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే.
* త్వరలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటి పునర్మిణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని అన్నారు. ఇది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడి వ్యవహారాలను కేంద్రం నేరుగా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. దీనికోసం ఇక్కడి యంత్రాంగం, పౌరులు అంతా సహకరించాలి’ అని కోరారు.
* పెద్దల అరాచకాలపై చర్చ జరగాలి : తమ్మినేని సీతారాం
బాలలహక్కులు – చట్టాలు అనే అంశంపై విశాఖలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాలన్నారు. బాలలపై అత్యాచారాలు చేసిన వాళ్లను భూమిపై లేకుండా చేయాలన్నారు. అప్పుడే బాలలకు న్యాయం జరుగుతుందన్నారు. బాలల రక్షణహక్కులపై శాసనసభలో చర్చిస్తామని తమ్మినేని సీతారాం తెలిపారు. పిల్లల హక్కుల కంటే పెద్దల ఆరాచకాలపై చర్చ జరగాలన్నారు. ప్రభుత్వాలు పిల్లల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. పిల్లల హక్కులు కాపాడాలని, వారికి స్వేచ్ఛ ఉండాలని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
* జగన్ తిరుపతి ప్రసాదం తింటారో..లేదో?. పవన్ కళ్యాణ్
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంగిత జ్ఞానం ఉన్న వారు ఎవరూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరని మండిపడ్డారు. వాళ్ళకు ఇంగిత జ్ఞానం అంటే తెలుసో..లేదో వాళ్ళ భాష ఇంగ్లీష్ లో దీన్ని కామన్ సెన్స్ అంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నా కూడా..కులం పేరు తగిలించుకుంటున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. జగన్ క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తారని.. దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తిరుపతి ప్రసాదం తింటారో లేదో తనకు తెలియదన్నారు. తనను పవన్ నాయుడు అని వైసీపీ నేతలు ప్రస్తావించటంపై కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించటం సరికాదన్నారు.
*అవినాష్ అపుడలా..ఇపుడిలా?
దేవినేని అవినాష్ వైకాపాలో చేరతారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఎన్నికలు అయిపోయిన కొన్ని నాళ్ళకే ఆయన విషయంలో ఆవార్థాలు వచ్చాయి. తెదేపాకి వీడి ఆయన వైకాపా తీర్దం పుచ్చుకోబోతున్నట్లుగా మీడియాలో కదానాలు వచాయి. అయితే ఆ కధనలకు అప్పుడు ఆయన ఖండించారు. ఎదో మాతమాత్రంగా ఖండించి ఉంటె అదో లెక్క అయితే అవినాష్ మరో పని కూడా చేశారు. అదేమంటే అప్పుడు ఆ వార్తలను రాసిన మీడియా వర్గాలకు ఆయన నోటీసులు పంపించారు. తను పార్టీ మరబోతున్నట్లుగా వార్తలు రాశారంటూ వివిధ మీడియా వర్గాలకు ఆయన లీగల్ నోటీసు పంపించారు. ఒక రాజకీయ నేత విషయంలో అలాంటి ఊహాగానాలు మామూలే. నిప్పు లేనిదే పొగరాదు. అయితే అవినాష్ మాత్రం ఏకంగా నోటీసులు పంపించి హడావుడి చేసారు.
* పార్టీ మారేవాళ్లు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా?: జేసీ దివాకర్‌రెడ్డి
జగన్ ప్రభుత్వంలో ప్రతీకార వాంఛ ఎక్కువైందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యర్థులను హింసించే సమయంలో… అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్లే అధికారులు వేధిస్తున్నారన్నారు. బస్సు బిజినెస్‌ను కొంత కాలం మానేయాలి అనుకుంటున్నట్టు జేసీ వెల్లడించారు. పార్టీ మారేవాళ్లు అధినేతను ఏదో ఒకటి అనాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ సుజనాచౌదరి కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు.
* మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట: డీకే అరుణ
ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల కోసమే ముఖ్యమంత్రికి పథకాలు గుర్తొస్తాయని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. ప్రజలను మోసం చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతుందన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై జోగులాంబ గద్వాల జిల్లాను దోచుకుతింటున్నారని విమర్శించారు.
*మహారాష్ట్రలో ఏకమైన శివసేన, కాంగ్రెస్
రోజులుగా సాగుతున్న మహారాష్ట్ర రాజకీయ ప్రతిస్తంభాన ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాట్లకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సిడంయ్యి. ఏమేరకు కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీల అధినేతలు అంగీకారం తెలిపారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పదవుల పంపకాల పై కూడా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్ర రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైన ముఖ్యమంత్రి పీటాన్ని ఐదేళ్ళ పాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సేపీకి మండలి చైర్మన్ దక్కేలా నేతలు అంగీకారానికి వచ్చారు.
*రాజకీయం క్రికెట్ లాంటిది
మహారాష్ట్ర రాజకీయాల పై తీవ్ర ఉత్కంట నెలకొన్న తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీయం క్రికెట్ ఆట లాంటిది ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అన్నారు. మ్యాచ్ ఓడిపోతామని కొన్నిసార్లు అనుకుంటాం కానీ ఫలితం లభిస్తుందని చెప్పుకొచ్చారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ డిల్లి రాజకీయాల పై ద్రుష్టి సారించానని మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు.
*50 మంది చనిపోయాక ఇసుక వారోత్సవాలా?
అయిదు నెలలుగా ఇసుక సరఫరా నిలిపేసి.. 50 మంది చనిపోయాక డొల్లతనం కప్పిపుచ్చుకోవటానికే వైకాపా ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు అంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 35 లక్షల మంది రోడ్డున పడ్డాక ఈ వారోత్సవాలు చేయటం రక్తం పూసుకుని వికటాట్టహాసం చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్కు జనసేన, తెదేపా, భాజపాలపై ద్వేషం ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలే తప్ప.. తెలుగుభాషను చంపొద్దని వ్యాఖ్యానించారు.
*మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తన మనసులోని మాటను జగ్గారెడ్డి బయటపెట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వైదొలిగిన రోజు ఆ పదవిని తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.ఈనెల 16న దిల్లీలో ఏఐసీసీ ముఖ్య సమావేశం ఉండటంతో తన బయోడేటాను పార్టీ పెద్దలకు పంపినట్లు జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురికి బయోడేటా పంపినట్లు ఆయన వివరించారు. ఈ అంశంపై త్వరలోనే పార్టీ పెద్దలను తాను కలుస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన వద్ద అద్భుతమైన మందు ఉందని.. అవసరమైనప్పుడు దానిని బయటకు తీసుకొస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
*జగన్తో కలిసి నడుస్తా: ఎమ్మెల్యే వంశీ
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వానికి మద్దతిస్తానని, ముఖ్యమంత్రి జగన్తో కలిసి నడుస్తానని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, వైకాపాకు ఎందుకు మద్దతివ్వాల్సి వచ్చిందో వివరించారు.ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. అప్పుడే దీక్షలు, ఉద్యమాలు అని ఎంతో అపార అనుభవమున్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేక పోతున్నారు. అకాల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నదిలో ఇసుకను తీయగలమా? ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పనిచేస్తే సమర్థించాలి.
*జగన్కు డబ్బుపై వ్యామోహం: చంద్రబాబు
రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమేనని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతి పనిలోనూ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్షను చంద్రబాబు విరమించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్కు డబ్బుపై వ్యామోహం ఎక్కువని.. బలవంతంగా ప్రజల ఆస్తులను రాయించుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యానించారు.
*భాజపా తీరుపై తెరాస ఆగ్రహం
కుట్రలు, కుతంత్రాలతోనే రాజకీయాలు చేయాలని భాజపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నె మాట్లాడుతూ.. భాజపా రాజకీయ దుర్మార్గపు క్రీడ ఆడుతోందని ఘాటుగా విమర్శించారు. తెరాస ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పడం నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమని దుయ్యబట్టారు. లక్ష్మణ్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారన్నారు. హుజూర్నగర్లో భాజపా డిపాజిట్ కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకున్నందుకు తెరాస నేతలు టచ్లో ఉన్నారా అని ప్రశ్నించారు. తెరాస అభివృద్ధిని నమ్ముకుంటే .. భాజపా అరాచకాన్ని నమ్ముకుందని ఆరోపించారు. తెరాస ప్రజా ప్రతినిధులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని.. ఉంటారని కర్నె స్పష్టం చేశారు.
*15 మందికి టికెట్లు కేటాయింపు
సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించిన 17మంది కర్ణాటక శాసనసభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా భాజపా తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప, పార్టీ రాష్ట్ర బాధ్యుడు మురళీధర్రావు వీరిని పార్టీలోకి స్వాగతించారు. మాజీ మంత్రి రోషన్ బేగ్ను చేర్చుకునేందుకు భాజపా అధిష్ఠానం అనుమతించలేదు. బెంగళూరులో వేలాది మంది నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మోసగించిన ఐఎంఏ కేసుతో రోషన్ బేగ్కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో భాజపా ఆయనను దూరం పెట్టినట్లు సమాచారం. భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీరందరినీ గెలిపించే బాధ్యత మనదేనని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపునిచ్చారు.
* తీసుకుపోతున్నారు: సోనియా
ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం, లౌకికవాదం, సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ, అలీన విదేశాంగ విధానం అనే నాలుగు కీలక స్తంభాలపై తొలి ప్రధాని నెహ్రూ దార్శనికత ఆధారపడి ఉంది. ఈ దార్శనికతపై ఇప్పుడు దాడి జరుగుతోంది. ఈ రోజు అధికారంలో ఉన్నవారు అంధత్వంతో ఈ వాస్తవాలను గుర్తించడం లేదు. వారి భాష ఆధునికంగా ఉండవచ్చు కానీ వారు దేశాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు.
*2 రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 12న ఉపఎన్నికలు
ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రెండు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 12న ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు విడుదల చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ సభ్యుడు కె.సి.రామ్మూర్తి భాజపాలో చేరేందుకు రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన తాజీన్ ఫత్మా రాజ్యసభకు రాజీనామా చేసి శాసనసభ ఉపఎన్నికల్లో పోటీ చేయడంతో ఖాళీ అయింది.
కర్ణాటకలో భాజపాకు కష్టాలు-రాజకీయ-11/15
Related tags :