Fashion

ఒక్కొక్క శరీరాకృతికి ఒక్కొక్క రకమైన చీరకట్టు

Different types of wearing a saree according to your body style-Telugu fashion news Nov 2019

ఒకొక్కరికి ఒక్కోరకంగా..
చీర కట్టుకుంటే అందంగా కనిపించాలి.. ఆధునికంగా ఉండాలి.. సౌకర్యంగా ఉండాలి.. మెరిసిపోవాలి.. వీటన్నిటితో పాటు ట్రెండీగానూ కనిపించాలి.. ఇవి ఈ తరం మగువలు కోరుకునేవి. కానీ ఒక్క విషయం.. ఎత్తు, బరువు, షేప్‌లను అనుసరించి చీరలను ఎంచుకోవాలి. ఆకట్టుకునే చీరకట్టుతో మెరిసిపోవాలంటే.. ఎలాంటి చీరలను కట్టుకోవాలో చూద్దాం అంటున్నారు నేటి డిజైనర్లు.
*పొడవైన వారికి..
పొడుగు ఎక్కువగా అమ్మాయిలు ఏ చీర కట్టుకున్నా అందంగానే కనిపిస్తారు. వారికి చీర బాగా నప్పుతుంది. వారి లుక్కే వేరుగా ఉంటుంది. వీళ్లకు హెవీ బార్డర్స్ నప్పుతాయి. బోల్డ్ ప్రింట్స్‌తో వెరైటీ కలర్స్ ఎంచుకుంటే మరింత బాగుంటారు. వీరికి ఇంగ్లీషు కలర్స్ బాగా నప్పుతాయి. అప్పుడు అందరి దృష్టి రంగుపైకి వెళుతుంది. పొడవు గురించి ఆలోచించరు.
*పొట్టివారికి..
పొట్టిగా ఉన్నాం.. మాకు చీరలు సూటవ్వవు అనుకుంటూ ఉంటారు. పొట్టిగా ఉన్నవారికి కూడా చీరలు బాగుంటాయి. అయితే ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. పొట్టిగా ఉన్నవారు పెద్ద ప్రింట్స్, హెవీగా ఉన్న బార్డర్స్ జోలికి వెళ్లకూడదు. చిన్న బార్డర్‌లు ఉండేట్లుగా చూసుకోవాలి. అలాగే.. చీర మొత్తం కూడా చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నవి అయితేనే బెటర్. పొట్టిగా, లావుగా ఉన్నా కూడా ఇలాంటి ఫ్యాషనే్న ఫాలో అవ్వాలి.
*వాల్యోపటస్ షేప్
నడుము నాజూకుగా ఉండి, పై భాగం, కింది భాగం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ కేటగిరీలోకి వస్తారు. వీళ్లు జార్జెట్, షిఫాన్, నెట్ ఫ్యాబ్రిక్ చీరలను ఎంచుకోవచ్చు. వీరికి డార్క్ కలర్స్ నప్పుతాయి. *అందాన్ని రెట్టింపు
చేస్తాయి. హెవీ ఎంబ్రాయిడరీ చీరల జోలికి పోకూడదు. సింపుల్‌గా ఉండే ఎంబ్రాయిడరీ, బీడ్ వర్క్ చీరలు వీరికి బాగుంటాయి. ఎంచుకునే చీరలు స్ట్ఫిగా కాకుండా జాలువారేలా ఉండాలి. క్రిస్, క్రాస్ స్ట్రింగ్స్ ఉన్న జాకెట్లు మరింత బాగుంటాయి.
*ఓవర్ వెయిట్
కాటన్, స్ట్ఫిగా ఉన్న ఫ్యాబ్రిక్‌లు పెద్ద శత్రువులు అని గుర్తుపెట్టుకోవాలి. షిఫాన్, సిల్క్ చీరలు ఇలాంటివారికి సరిగ్గా సరిపోతాయి. అలాగే ముదురు రంగుల దుస్తుల వల్ల వీరు లావుగా కనిపించరు. ఇలాంటివారు హ్యాండ్‌లూమ్ చీరలను కట్టుకోవచ్చు. ఫుల్ స్లీవ్స్, లాంగ్ లెంగ్త్ బ్లౌజ్‌లు వీరి అందాన్ని రెట్టింపు చేస్తాయి. లావుగా ఉన్నవారు చీర కట్టే విధానం సింపుల్‌గా ఉండేలా జాగ్రత్త పడాలి.
*నాజూగ్గా ఉన్నవారికి..
సన్నగా, రివటగా ఉన్నవారు కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలను ఎంచుకోవచ్చు. సన్నగా ఉన్నవారికి బొద్దుగా, అందంగా కనిపించేట్లు భ్రమింపజేస్తాయి. లైట్ కలర్స్, హెవీ ఎంబ్రాయిడరీ చీరలు వీరికి బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే.. బ్రొకేడ్, బీడ్ వర్క్ చీరలు కొత్తందాలను తెస్తాయి. బ్యాక్‌లెస్, స్లీవ్‌లెస్, హాల్టర్ నెక్, ట్యూబ్ బ్లౌజ్‌లతో అందరి మతులనూ పోగొట్టవచ్చు.
*పియర్ షేప్
ఈ ఆకృతి ఉన్నవాళ్లకు పై భాగంతో పోలిస్తే కింది భాగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి షిఫాన్, జార్జెట్ చీరలను ఎంచుకుంటే బాగుంటుంది. అలాగే చేపలా చీరను చుట్టకుండా కుచ్చిళ్లు పెద్దగా పెట్టి, కొంగు సింపుల్‌గా వేస్తే సరిపోతుంది. వీరికి బోల్డ్, లైట్ కలర్స్ నప్పుతాయి. చిన్న ప్రింట్స్, ఎంబ్రాయిడరీ, పెద్ద బార్డర్‌లు వచ్చిన చీరలను ఎంచుకోవచ్చు.
*యాపిల్ షేప్
పొట్ట, పై భాగం ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ ఆకృతికి చెందినవారు. వీరు ఎంబ్రాయిడరీ ఎక్కువగా వచ్చిన చీరలను ఎంచుకోవాలి. కొన్ని భాగాల్ని కప్పేలాగా ఉంటూ, జాకెట్టు కచ్చితంగా పొడుగు చేతులు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటివారికి సిల్క్ చీరలు నప్పుతాయి. నెట్ ఫ్యాబ్రిక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు. అలాగే ఇలాంటివారు ఉల్టా పల్లూని ట్రై చేయవచ్చు. అవసరమైన చీరలకు కాంట్రాస్ట్ జాకెట్లను ఎంచుకుంటే మరింత బాగుంటాయి.
చీర కట్టుకోవాలని ఉన్నా అందరికీ సెలక్షన్ చేయడం రాదు. అది దృష్టిలో పెట్టుకుని కొన్ని చిట్కాలను ఇస్తున్నారు నిపుణులు. వాటిని ఫాలో అయిపోవాలి అంతే..

Image result for types of saree wear"

Image result for types of saree wear"