షాపింగ్ అంటే ఎగిరి గంతేస్తారు అమ్మాయిలు. అందుకోసం ఎన్ని గంటలు కేటాయించడానికైనా సిద్ధమే. కథానాయికల్లో చాలామందికి ఈ పిచ్చి ఉంది. రకుల్‌ప్రీత్ సింగ్ మాత్రం అలా కాదట. ఆమె చెబుతూ ‘‘షాపింగుల పేరుతో గంటల కొద్దీ సమయం పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు. చూస్తాను.. నచ్చితే.. వెంటనే ‘ఓకే’ అనేస్తాను. రంగులు, డిజైన్లు అంటూ ఎంపిక చేసుకోను. ఆ సమయానికి నాకు నచ్చితే చాలు. షాపింగ్ విషయంలో నాకు ఓపిక తక్కువే. కాకపోతే స్నేహితులకో, ఇంట్లో వాళ్లకో ఏమైనా కొనాలంటే మాత్రం ఇంకొంత టైమ్ తీసుకుని ఎంపిక చేస్తా. మనం ఇచ్చే బహుమానాలు ప్రత్యేకంగా ఉండాలన్నది నా ఆశ’’ అంటోంది. ‘‘తెరపై కనిపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. డిజైనర్లతో మాట్లాడి, ట్రెండ్‌కి తగిన దుస్తుల్ని ఎంపిక చేసుకుంటుంటాను. బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాను. నా ఫ్యాషన్ అవసరాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇలాంటివే కావాలని పట్టుపట్టను. అందుకే నా షాపింగ్ తొందరగా పూర్తవుతుంద’’ని చెప్పింది రకుల్.
షాపింగ్ ఓపిక లేదు
Related tags :