Movies

కియారాకు ప్రెగ్నెన్సీ

Kiara Advani Becomes Pregnant

కియారా అద్వానీ.. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి స్టార్ హీరోయిన్ గుర్తింపు అభించింది. అదే ఊపుతో వెంటనే రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసిన.. సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. అయితే హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది కియారా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో కియారాకు హిందీలో విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగా ఈ భామ రెండు సినిమాలను అక్షయ్ కుమార్‌తో మరో సినిమాను కార్తిక్ ఆర్యన్‌తో చేస్తోంది. కాగా అక్షయ్ కూమార్‌ సరసన నటిస్తోన్న గుడ్ న్యూస్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ ఫస్ట్‌లుక్‌లో కియారా గర్భంతో అందరికి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో మరో పాత్రలో కరీనా కపూర్ ఖాన్, పంజాబీ నటుడు దిల్ జిత్ దోసాంజ్ నటిస్తున్నారు. రోమాంటిక్ కామెడీగా వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్బంగా గుడ్ న్యూజ్‌ను ఫస్ట్ లుక్‌ను కియారా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.