Health

సంగీతం వినండి. గుండెపోటుకు దూరమవ్వండి.

Music Moves Heart Attacks Away-Telugu Health News Today Nov 2019

సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుందని బ్రెజిల్‌లోని సావోపాలో వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా వారంలో ఒకటి లేదా రెండుసార్లే కారు డ్రైవింగ్‌ చేసే 18-23 ఏళ్లలోపు ఐదుగురు మహిళలను ఎంపిక చేశారు. మొదటిరోజు అత్యంత రద్దీ ఉండే మార్గంలో 20 నిమిషాల పాటు వారితో కారును డ్రైవ్‌ చేయించారు. మరుసటిరోజు అదే రూట్‌లో కారులో సీడీ ప్లేయర్‌/రేడియో ద్వారా పాటలు పెట్టి, డ్రైవింగ్‌ చేయించారు. ఈరెండు సందర్భాల్లోనూ వారి గుండె కొట్టుకునే రేటును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఛాతీభాగంలో హర్ట్‌ రేట్‌ మానిటర్‌ను అమర్చారు. ఏ వ్యాపకం లేకుండా డ్రైవింగ్‌ చేసిన సమయంలో కంటే.. మ్యూజిక్‌ వింటూ కారు నడిపినప్పుడు వారి నాడీ వ్యవస్థ, గుండెలపై ఒత్తిడి తగ్గినట్లు అధ్యయనంలో
గుర్తించారు.