ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా డిల్లి పర్యటనకు వెళ్లారు. ఆయన భాజపా జాతీయ అద్యక్షుడు అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఏపీలో తెదేపా వైకాప కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భాజపా భావిస్తోంది జనసేనాను భాజపాలో విలీనం చేయాలని అమిత్ షా కోరారని గతంలోనే పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. అందుకు పవన్ ససేమీరా అన్నారు. ఇక భాజపాతో పొత్తు దిశగా అమెరికాలో జరిగిన తానా సభల వేదికగా చర్చలు మొదలయ్యాయి. భాజపా సీనియర్ నేత రాం మాధవ్ నేరుగా పవన్ తోనే చర్చించారు. ఇక ఇప్పుడు పవన్ డిల్లి పర్యటనలో అమిత్ షా ను కలుస్తారనే వార్తల ద్వారా తిరిగి ఏపీలో భాజపా జనసేన పొత్తుతో ముందుకు సాగుటారా అనే ఆసక్తి కర చర్చ మొదలైంది. ఏపీలో చంద్రబాబు జగన్ ను దెబ్బతీసి సొంతంగా ఇప్పుడు తమకు ఉన్న శక్తి చాలదని భాజపా గ్రహించింది. దీంతో ఏపీలో సామాజిక సమీకరణాల ఆధారంగా జరిగ్గే రాజకీయ పోరులో తెదేపా వైకాపాకి భిన్నమైన వర్గాలకు దగ్గరగా తీసుకోవాలని భావిస్తోంది. ఆదిశగా 2014 ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచినా పవన్ ను ఏపీలో కలుపుకోపోవాలని చాల కాలంగా భాజపా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే భాజపా సీనియర్ నేత రాం మాధవ్ అమెరికాలో తానా వేదికహా పవన్ తో చర్చలు చేస్తారని అప్పట్లోనే జోరుగా ప్రచారం సాగించి. అయితే భాజపా తొలుత పార్టీ విలీనం ప్రతిపాదించగా పవన్ సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ఇప్పుడు పొత్తు దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.
భాజపాతో పొత్తు కోసం ఢిల్లీలో పవన్ చక్కర్లు
Related tags :