కరవులోనూ ఆహార భద్రతకు ఢోకా ఉండదని భరోసానిస్తున్న పరిశోధనిది! మొక్కలు, చెట్లలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన కీలక ప్రొటీన్ మిశ్రమాన్ని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ పరిశోధకులు కనుగొన్నారు. దీన్ని మార్పు చేయడం ద్వారా కిరణజన్య సంయోగక్రియలో మార్పులు తీసుకొచ్చి దిగుబడులను పెంచవచ్చని చెబుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని మొక్కలు ఎక్కువ ఫలసాయం ఇవ్వడానికి ఈ పరిశోధన దోహదపడగలదని భావిస్తున్నారు. ‘నేచర్’ పత్రిక ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. పరిశోధకులు కిరణజన్య సంయోగక్రియలో కీలక పాత్ర పోషించే ‘బీ6ఎఫ్’ అనే ప్రొటీన్ మిశ్రమాన్ని గుర్తించారు. కాంతిని రసాయనశక్తిగా మార్చే ‘ఫొటోసిస్టమ్-1, 2’ అనే రెండు ప్రొటీన్ల మధ్య ఎలక్ట్రికల్ సంధానతకు ఈ మిశ్రమం దోహదపడుతుంది. ఈ బీ6ఎఫ్ సైటోక్రోమ్‌లు విద్యుత్‌ను ఎలా వినియోగిస్తాయి? మిగతా ప్రొటీన్లకు దాన్ని ఎలా ప్రసారం చేస్తాయన్న విషయాన్ని గుర్తించారు. వీటి పనితీరులో మార్పు తీసుకురావడం ద్వారా… కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని పెంచవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
కరువులోనూ అధిక దిగుబడిని ఇచ్చే వంగడం
Related tags :