DailyDose

కూలిన వొడాఫోన్‌ ఐడియా షేర్లు-వాణిజ్యం-11/15

Vodafone Idea Stocks Plunge-Telugu Business News Today-11/15

*వొడాఫోన్‌ ఐడియాకు భారీగా నష్టం వచ్చింది. గురువారం మరో 21.6 శాతం పతనమయ్యాయి. ఫలితంగా వొడాఫోన్‌ ఐడియాషేర్లు రూ. 2.90 కి పడిపోయాయి. ఫలితంగా సెప్టెంబర్ త్రైమాసికంలో ఆ సంస్థ రూ. 50,921 కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్‌‌ బకాయిలను మూడు నెలల్లోగా చెల్లించాలంటూ డిపార్ట్‌ మెంట్‌‌ ఆఫ్‌ టెలికం (డాట్‌‌) ఆపరేటర్లకు నోటీసులిచ్చింది. సెల్ఫ్‌ ఎసెస్‌ మెంట్‌‌ ప్రాతిపదికన బకాయిలను చెల్లించే ఆప్షన్‌ నూ డాట్‌‌ కల్పించింది. బకాయిలను డాట్‌‌కు మూడు నెలల్లో చెల్లించి, తమకుతెలియచేయాల్సిందిగా సుప్రీం కోర్టు గత నెలలో టెలికం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది.
*కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన బీఎస్‌‌-6 స్టాండర్డ్స్‌‌ ప్రకారం రూపొందించిన ఇంజన్‌‌తో హోండా టూవీలర్స్ ఇండియా మార్కెట్లోకి గురువారం ఎస్పీ 125 బైకులను విడుదల చేసింది. డ్రమ్‌‌ బ్రేక్‌‌ వెర్షన్‌‌ ధర రూ.72,900 కాగా, డిస్క్‌‌బ్రేక్‌‌ వెర్షన్‌‌ ధర రూ.77,100. సీబీ షైన్‌‌ 125 మోడల్‌‌ ధరతో పోలిస్తే దీని ధర రూ.తొమ్మిది వేలు ఎక్కువ. ఎస్పీ 125 బైక్లోని 124 సీసీ ఇంజన్‌‌ 10.9 ఎన్‌‌ఎం టార్క్‌‌ను విడుదల చేస్తుంది. ఐదు గేర్లు ఉంటాయి.
*హైదరాబాద్, అమరావతి, విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.36 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 71.80 వద్ద కొనసాగుతోంది. అమరావతిలోనూ ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ. 77.95 కు చేరింది. ఇక డీజిల్ ధర రూ. 71.10 వద్ద స్థిరంగా ఉంది.
*ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ఈ పన్నుల వసూళ్ల ద్వారా రూ.13.35 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్ణయించారు.
*భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని మోదీ బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్‌) దేశాల వ్యాపార, పారిశ్రామికవేత్తలను కోరారు.
*హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) గురువారంనాడు మార్కెట్లోకి బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన కొత్త ఎస్‌పీ 125 బైక్‌ను విడుదల చేసింది.
*హైదరాబాద్‌ సమీపంలోని పాశమైలారంలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్‌లో యూఎ్‌సఎ్‌ఫడీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ నెల 4 నుంచి 13 తేదీల మధ్య హైదరాబాద్‌లోని ఇంజెక్టబుల్‌ ఫార్ములేషన్ల తయారీ యూనిట్‌లో యూఎ్‌సఎ్‌ఫడీఏ తనిఖీలు నిర్వహించిందని, 14 లోపాలను గుర్తించి ఫారమ్‌ 483ని జారీ చేసిందని అరబిందో ఫార్మా వెల్లడించింది. అమెరికా నియంత్రణ సంస్థ గుర్తించిన లోపాలు డేటా ఇంటిగ్రిటీకి సంబంధించినవి కావని.. నిర్ణీత కాల వ్యవధిలో వీటిని సవరిస్తామని పేర్కొంది.
*మొండి బకాయిల కోసం భారీగా కేటాయింపులు చేయడంతో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.1,194 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
*మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ నష్టాలు పెరిగాయి. 2019 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత నష్టం రూ.25.11 కోట్ల నుంచి రూ.29.47 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఆదాయం రూ.232.90 కోట్ల నుంచి రూ.111.11 కోట్లకు తగ్గింది. ప్రథమార్ధానికి రూ.265.35 కోట్ల ఆదాయంపై రూ.135.58 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
*సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.83.10 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.54.11 కోట్లతో పోలిస్తే 54 శాతం పెరిగింది.