వైకాపా అక్రమ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సూచించారు. జైలు నుంచి విడుదలైన చింతమనేనితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని ప్రభాకర్ పై 11 కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా అన్యాయం ఇంకోటి లేదని మండిపడ్డారు. తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని చింతమనేనికి చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి పర్యటనలో కలుద్దామని తెలిపారు.
చింతమనేని…ధైర్యంగా ఎదుర్కో!
Related tags :