NRI-NRT

డా.చెరుకూరి రమేశ్‌కు అరుదైన రికార్డు

డా.చెరుకూరి రమేశ్ అరుదైన రికార్డు-Dr.Cherukuri Ramesh Of Bay City MI Ranks No.1 In Coronary Bypass Surgery Across USA

డెట్రాయిట్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డా.చెరుకూరి రమేశ్‌కు అరుదైన గౌరవం లభించింది. అమెరికావ్యాప్తంగా కరోనరీ బైపాస్ సర్జరీలో ఆయన ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని dexur.com అనే ప్రముఖ మెడికల్ వెబ్‌సైట్ ప్రచురించింది. డా.చెరుకూరి రమేస్ ప్రస్తుతం మిషిగన్ రాష్ట్ర బే సిటీ మెక్‌లారెన్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆయన గతంలో సాగినాలోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో కూడా పనిచేశారు. గత 40ఏళ్లుగా ఆయన గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయడంలో నిపుణులుగా పేరుగడించారు. అరుదైన రికార్డు స్థాపించిన డా.చెరుకూరి రమేశ్‌ను పలువురు ప్రవాసులు అభినందించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పొట్టిపాడు. 1975లో గుంటూరు వైద్యకళాశాల నుండి ఆయన ఎంబీబీఎస్ పట్టా పొందారు.

Read more here – https://dexur.com/doctors/usa/#coronary-bypass-surgeons