Devotional

ఈ క్షణం…ఇప్పుడు బ్రతుకు….అదే నిజం

Live At This Moment - That Is The Truth

“భూములు పోతాయ్, డబ్బులు పోతాయ్, మనుషులు పోతారు, బంధాలు పోతాయ్, కోటలు కూలుతాయ్, కాలం పోతుంది, నువ్వు కూడా పోతావ్, మరి ఇక్కడ నీదనేది ఏది? ఇప్పుడు నీ కళ్లముందున్న దృశ్యం, నీ మెదడులో మెదిలే ఆలోచన, నీ నరాల్లో సత్తువ, నీ నాడి చప్పుడు, నువు పీల్చే ఊపిరి, నిను తాకే గాలి, ఇవన్నీ ఏం చెప్తున్నాయో ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ పోస్ట్ చదవడానికి నువు వెచ్చించిన సమయం కూడా పోతుంది. ఓ చోట ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది కాలం, అది ఉన్నప్పుడే అనుభవించాలి, పోయాక ఏడ్చినా రాదు. అది నీకు ముందూ ఉంది, నువు పోయాక కూడా ఉంటుంది, మధ్యలో వచ్చి పోయిది నువ్వే. లేని దాని గురించో, రాని దాని గురించో, ఎక్కువగా ఆలోచించి, ఇప్పుడు నీతో ఉన్న కాలాన్ని కోల్పోకు. రేపేంటి? ఎల్లుండి ఏంటి? పదేళ్ల తర్వాత ఏంటి? అని కాదు, ఈరోజేంటి? ఇప్పుడేంటి? ఇప్పుడు నీతో ఉన్న క్షణం ఏంటి? దాన్ని నువ్వు ఏం చేస్తున్నావ్? అనేది ముఖ్యం. ఓ బ్రతికున్న శవం లా ఉండకు, బయటికి రా. నీతో ఉన్న కాలం మాత్రమే నీది, అది చూపించే దృశ్యం, వినిపించే ధ్వని, నిను తాకే స్పర్శ, నువు పీల్చే గాలి, నువు పొందే అనుభూతి, అదే నిజం. ఆ నిజం లోనే బ్రతుకు…”