కేదార్‌నాథ్ ఆలయంలో దర్శనాలు ఈ రోజుతో ముగియనున్నాయి.
మే 9వ తేదీన ఆలయం తెరుచుకుంది ఆరు నెలల పాటు భక్తులకు ధర్శనం ఇచ్చిన కేదార్‌నాథుడి ఆలయం శీతాకాలం సందర్భంగా ఈ రోజు మూతపడనుంది.
సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించరు.
దీంతో ఛార్‌థామ్ యాత్ర అధికారికంగా ముగియనుంది.
గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.
ఆలయ ద్వారాలు మూసివేత సందర్భంగా వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు.
తిరిగి దర్శనం ఎప్పుడు అనేది ప్రకటించే వరకు భక్తులు యాత్రకు రావొద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
బద్రీనాథ్ ఆలయం దర్శనాలు కూడా నేటితో ముగియనున్నాయి.