బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి క్లీన్‌చిట్ లభించింది. గంగూలీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. బంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగానే కాకుండా బీసీసీఐ ఏజీఎమ్‌లో బంగాల్ నుంచి ప్రతినిధిగా కూడా ఉన్నాడని ఆరోపించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ దాదాకు విరుద్ధ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకముందే క్యాబ్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని తెలిపారు. 2019 అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియాకు దాదా రాజీనామా లేఖను సమర్పించాడు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఇందులో లేవని జైన్ పేర్కొన్నారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒకే సమయంలో ఏ వ్యక్తీ ఒకటి కంటే ఎక్కువ హోదాల్లో పని చేయడానికి వీల్లేదు. ఈ నిబంధన వల్ల గతంలో రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్‌దేవ్‌పై కూడా విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
గంగూలీకి క్లీన్‌చిట్
Related tags :