ప్రయాణికులకు రైల్వేశాఖ కొత్త ఆఫర్ ప్రకటించింది.
ముందస్తుగా రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారు చార్జీ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది.
అయితే, టికెట్ ధర రూ.50 వేలు దాటినవాటికే ఇది వర్తిస్తుందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) స్పష్టంచేసింది.
తమ వెబ్‌సైట్‌లో నమోదైన రిజిస్టర్డ్ యూజర్స్, గెస్ట్ యూజర్స్‌తో పాటు ఐఆర్సీటీసీ కౌంటర్ల వద్ద కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవచ్చునని తెలిపింది. ఏజెంట్లకు ఈ అవకాశం లేదని స్పష్టంచేసింది.
రిజర్వేషన్‌లో భాగంగా 35 రోజుల ముందు మొదటి వాయిదాను, ఆ తర్వాత 30 రోజుల్లో రెండో వాయిదా చెల్లించాలని సూచించింది.
ప్రయాణ తేదీకి ముందే మొత్తం చెల్లింపులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కన్ఫర్మేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.
ప్యాకేజీల క్యాటగిరిని బట్టి మొత్తం చార్జీలో 25నుంచి 30 శాతాన్ని మొదటి పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.