తెలంగాణలో ప్రస్తుతం నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో పోలీసులు తప్ప మరే విభాగం క్రియాశీలకంగా లేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత కోదండరామ్ వ్యంగ్యంగా విమర్శించారు. సమస్యల పరిష్కారం కోరుతూ నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉన్నట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. సమస్యలపై చర్చించి పరిష్కరించాల్సింది పోయి కార్మికులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి పోకడలు ఏ ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణాలో నియంతృత్వ పోకడలు
Related tags :