క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అప్పట్లో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ చెందిన పలువురిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఆమె తమిళ హీరో, స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయనిధి స్టాలిన్‌పై వ్యాఖ్యలు చేస్తూ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఉదయనిధి స్టాలిన్ తనతో ఏకాంతంగా గడిపాడంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
దీంతో చెన్నైలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ తాను అసలు ఉదయనిధిని డైరెక్టుగా కూడా చూడలేదని, తన పేరుతో నకిలీ అకౌంట్ నుంచి ఈ పోస్టు విడుదలైందని చెప్పింది.
ఎవరో కావాలనే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారంటూ మండిపడింది.
త్వరలో రాజకీయాల్లోకి వస్తానని శ్రీరెడ్డి తెలిపింది.
తమిళనాడులో ఒక ప్రముఖ పార్టీలో చేరబోతున్నానని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడిస్తానని చెప్పింది.