Editorials

We are not responsible for theft & damage బోర్డులకు మంగళం

Supreme Court Of India Says If You Pay For Parking Then They Are Responsible For Damages

వాహనాల పార్కింగ్​కు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్ని నిర్వహిస్తున్న యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వాహనానికి ఏదైనా జరిగితే దాని యజమానిదే బాధ్యత అని బోర్డు పెట్టి తప్పించుకోలేరని తెలిపింది.

ఈ మేరకు జస్టిస్ మోహన్ ఎం. శాంతన గౌడర్, జస్టిస్ అజయ్ రస్తోగీలు తాజ్​మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో తీర్పు చెప్పారు.

కేవలం నిర్లక్ష్యం కారణంగా చోరీ జరిగితే పూర్తిగా హోటలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

1998 ఆగస్టు ఒకటో తేదీన దిల్లీలో జరిగిన మారుతీజెన్ కారు చోరీకి సంబంధించిన బాధ్యత హోటల్​దే అని చెప్పి జాతీయ వినియోగదారుల ఫోరం బాధితుడికి 12% వడ్డీతో రూ. 2.80 లక్షల పరిహారం, న్యాయ వివాదాల ఖర్చుల కింద రూ.50 ఇవ్వాలని 2018లో తీర్పు ఇచ్చింది.

దాన్ని సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించగా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పింది.