Fashion

గర్భిణి స్త్రీల చర్మ సౌందర్యానికి కొబ్బరినూనె

Telugu Fashion Beauty & Lifestyle News-Coconut Oil For Pregnant Skin Care

గర్భం దాల్చిన స్త్రీలు కొబ్బరినూనెను ఒంటికి రాసుకోవాలి. ఇలాచేయడం ద్వారా కాన్పు తర్వాత చర్మం మీద కనిపించే గీతలు, మచ్చలు తొలగిపోతాయి. వంటలో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి.

తల్లి పాల తరువాత లారిక్‌ యాసిడ్‌ అధికంగా లభించేది కొబ్బరి నూనెలోనే. ఇది తల్లి, బిడ్డ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. అంతేకాదు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

ఇంకా పసిపిల్ల చర్మ సంరక్షణకు కూడా కొబ్బరినూనె చిన్న పిల్లల సున్నితమైన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దోమకాటు వల్ల పిల్లల చర్మం మీద ఎర్రటి మచ్చలు, దురద వంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే చాలు తగ్గిపోతాయి.

అలాగే రోజూ కొబ్బరి నూనెను వాడటం ద్వారా అది బాడీ లోషన్‌గా పనిచేస్తుంది. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌‌గా ఉపయోగపడుతుంది.