Movies

నేడు ఫైర్‌బ్రాండ్ రోజా జన్మదినం

The real name of Roja Selvamani and her life story

నటనతో వెండితరపై మెప్పిస్తూ.. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటున్న వ్యక్తి రోజా. పూర్తి పేరు రోజా సెల్వమణి.

ఇటు చిత్ర సీమలో, అటు రాజకీయాలలో మొదట మాటలు పడ్డా, తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని విజయాల బాట పట్టారు.

ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూ, మరో వైపు జబర్దస్త్​ కామెడీ షోలో జడ్జ్​గా వ్యవహరిస్తున్న నవ్వుల రోజా పుట్టిన రోజు నేడు.

ఆమె జన్మదినం సందర్భంగా కొన్ని రోజా జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం.

రోజాగా మారిన శ్రీలత
రోజా 1972, నవంబర్‌ 17న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో నాగరాజరెడ్డి, లలిత దంపతులకు జన్మించారు.

రోజాకు కుమారస్వామి రెడ్డి, రామప్రసాద్‌ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

కొన్నాళ్ల తరువాత వీరి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చింది.

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు.

రోజా అసలు పేరు శ్రీలత. రోజా కూచిపూడి నాట్యం నేర్చుకొన్నారు. సినిమాల్లోకి రాకముందు ప్రదర్శనలు చేసేవారు.

సినీ ప్రస్థానం
తెలుగు సినిమాతో మొట్టమొదటిసారి చిత్రసీమకు పరిచయమయ్యారు రోజా.

సర్పయాగం అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

రాజేంద్ర ప్రసాద్​ సరసన నటించిన ‘ప్రేమ తపస్సు’ సినిమా రోజాకు తెలుగులో రెండవ సినిమా.

1991నుంచి 2002 వరకు దక్షిణ భారత చిత్ర సీమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తమిళంలోనూ రోజా అనేక సినిమాల్లో నటించారు.

ఆర్​కే సెల్వమణి దర్శకత్వంలో ప్రశాంత్​, రోజా హీరోహీరోయిన్లుగా చెంబుమతి సినిమాలో నటించారు.