WorldWonders

అమెరికాలో ఆవుపిడకలకు భారీ గిరాకీ

Cow Dung Patties Demand In USA

అమెజాన్‌లోనో లేక ఫ్లిప్‌కార్ట్‌ లోనో పిడకలు అమ్మకాల గురించి మనం గతంలో విన్నాం. అయితే ఈ పిడకల వ్యాపారం అమెరికాలో కూడా కలకలం సృష్టిస్తోంది. న్యూజెర్సిలోని ఓ షాపులో ఇవి దర్శనమిచ్చాయి. పది పిడకలు ఉన్న ఓ ప్యాకెట్ ధర మన కరెన్సీలో అయితే దాదాపు రూ.214. అక్కడ నివశించే ఓ భారత సంతతి వ్యక్తి దీన్ని ఫొటో తీసి ..ఇక్కడున్న బంధువుకు పంపించారు. ఆ విధంగా అది సోషల్ మీడియా బాట పట్టి నెటిజన్ల దృష్టిలో పడింది. “ఇది ఓ భారతీయ ఉత్పత్తి , ఇది తినే పదార్థం కాదు, మతపరమైన విషయాల్లో మాత్రమే వినియోగించాలి” అని ప్యాకెట్ మీద రాసిఉండటం పలువురిని ఆకర్షిస్తోంది.