అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని భారత సంస్కృతిలోని మాట. ఇంతే ప్రాధాన్యతతో ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట ‘అవయవదానం’. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన మొదట్లో దీనిపై కొన్ని అపోహలు వచ్చినప్పటికీ ప్రజల్లో రోజు రోజుకి అవగాహన పెరుగుతోంది. అయితే ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించి భారత్ ముందు వరుసలో ఉండడం గమనార్హం. ‘ఐపోస్ 2018’ విడుదల చేసిన నివేదక ప్రకారం అవయవదానం చేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 74 శాతంతో భారత్ ఈ ఘనత సాధించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అవయవదానంలో భారత్ కంటే వెనకబడి ఉన్నాయి. కాగా ఐపోస్ 2018 నివేదక ప్రకారం 75 శాతంతో కొలంబియా మొదటి స్థానంలో ఉంది. ఇక టర్కీ 72 శాతంలో మూడో స్థానంలో ఉంది. కొలంబియా: 75%, ఇండియా: 74%, టర్కీ: 72%, పొలాండ్: 71%, బ్రెజిల్: 70%, కెనడా: 69%, బ్రిటన్: 67%, ఇటలీ: 66%, అమెరికా: 65%, చైనా: 62%, ఫ్రాన్స్: 57%, జర్మనీ: 53%, మలేషియా: 50%, సౌదీ అరేబియా: 44%, దక్షిణ కొరియా: 39%, జపాన్: 33%, రష్యా: 30%.
అవయవదానంలో మనమే నెం.1
Related tags :