ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు రాజకీయ వ్యుహకర్తలను ఆశ్రయిస్తాయి. ఇటీవల కాలంలో ఎన్నికల స్ట్రాటజీల దిట్టగా పేరొందిన వారిలో ప్రశంత్ కిషోర్ ముఖ్యులు. 2014లో ఆయన భాజపాకి పని చేసారు. అప్పటి నుంచి ఆయా బాగా వెలుగులోకి వచ్చారు. ఆతరువాత ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైకాపాకి [పని చేసారు. 2019 ఎన్నికల్లో వైకాప గెలుపు వెనుక ఆయన పాత్ర కూడా ఉంది. ఇందుకు ఆయనకు లేదా ఆయన నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి వైకాపా కోట్లాది రూపాయలు చెల్లించిందట.
**ఎన్నికల తేదీలు ప్రకటించాక 221 కోట్ల విరాళం
ఏపీలో తెదేపా. వైకాపా భాజపా కాంగ్రెస్ జన్సేన ఇతర పార్టీలు 2019 ఎన్నికల్లో పెద్ద మొతంలో ఖర్చులు పెట్టారు. ఇందుకు సంబందించిన లెక్కలు ఎన్నికల కమిషన్ కు ఇస్తారు. ఎన్నికల వ్యయం పై వైకాపా ఈసీకి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం ప్రశాంత కిషోర్ రూ.37.5 కోట్లు చెల్లించింది. ఎన్నికల షెడ్యుల్ నాటికీ తమ వద్ద రూ.74 లక్షలు ఉన్నాయని ఎన్నికల తేదీలు ప్రకటించిన అనంతరం విరాళాల రూపంలో రూ.221 కోట్లు వచ్చాయని తెలిపింది.
**ఎన్నికల్లో రూ.85 కోట్లు ఖర్చు
ఎన్నికల్లో రూ. 85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో రూ. 9.7కోట్లు స్టార్ క్యాంపెయిన్ లకు, రూ. 36 కోట్లు వివిధ మీడియా సంస్థలకు చేల్లినట్లుగా తెలిపింది. ఇందులో ఎక్కువగా అంటే రూ. 24 కోట్లు జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ వెళ్ళినట్లు తెలిపింది. రూ. 1.03కోట్లు పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్లు హోర్డింగ్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. ఖర్చుల అనంతరం రూ. 138కోట్లు మిగిలినట్లు పేర్కొంది. స్క్రాప్ విక్రయించడం ద్వారా రూ.33 వెలు వచ్చినట్లు పేర్కొంది.
**వైకాపాకి వచ్చిన విరాళాల ఇలా..
అలాగే గత నెలలో ఎన్నికల కమిషన్ కు 2018-19ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన యాన్యువల్ ఆడిట్ రిపోర్టే వైకాపా సమర్పించింది. ఇందులో రూ.181కోట్లు విరాళాల ద్వారా వచ్చినట్లు తెలిపింది. ఎలాక్త్రోల్ బాండ్స్ ద్వారా అందినట్లు తెలిపింది. నాన్ కార్పోరేట్ సంస్థల ద్వారా రూ. 36.08 కోట్లు విరాళాలు వచ్చాయని పేర్కొంది. అంతకుముందు ఏడాది వీటి నుంచి రూ. 11.7 కోట్లు వచ్చాయి. ఇక కార్పోరేట్ కంపెనీల నుంచి రూ.18కోట్లు వచ్చినట్లు తెలిపింది. గత ఏడాది ఈ విరాళాలు రూ.2.53 కోట్లుగా ఉంది.
**తెదేపా ఎన్నికల ఖర్చు 77 కోట్లు
మరోవైపు ఎన్నికల తేదీలు ప్రకటించే నాటికీ తమ వద్ద 102 కోట్లు ఉన్నట్లు తెదేపా తెలిపింది. తేదీలు ప్రకటించాక విరాళాల రూపంలో 131 కోట్లు వచ్చాయి. చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం రూ. 9కోట్లక్లు హెలికాప్టర్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపింది. మొత్తంగా తెదేప్సా ఎన్నికల ఖర్చు 77కోట్లు ఖచు చేసినట్లు తెలిపింది. ఇందులో రూ. 49 కోట్లు మీడియా పబ్లిసిటీకి ఖర్చు చేసింది. ఖర్చు అనంతరం తెదేపా వద్ద 155 కోట్లు ఉంది.
ప్రశాంత కిషోర్‌కు ₹37 కోట్లు ఇచ్చిన జగన్. చంద్రబాబు హెలికాప్టర్‌కు ₹9కోట్లు.
Related tags :