మొన్నటికిమొన్న వాట్సాప్‌తో పెగాసస్ అనే స్పైవేర్ (నిఘా వైరస్) కొందరు ప్రముఖులపై గూఢచర్యం చేసింది. అది పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు దాని బాటలోనే ఎంపీ4 ఫైల్ ఫార్మాట్లో వీడియోలను పంపి రిమోట్ అటాకర్లు ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) వెల్లడించింది. ముప్పును ‘హై సివియారిటీ– (అత్యంత తీవ్రం)’ కింద పరిగణించింది. ‘‘వాట్సాప్ యూజర్లకు ఎంపీ4 ఫైల్ ద్వారా వీడియోలను పంపుతూ రిమోట్ అటాకర్లు ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. బఫర్ ఓవర్‌ఫ్లో ద్వారా అటాకర్లు ఫోన్లోకి కోడ్‌ను పంపి చొరబడుతున్నారు. యూజర్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే డేటాను తీసుకుంటున్నారు” అని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 2.19.274, ఐవోఎస్2.19.100 వెర్షన్ల వాట్సాప్‌పై ప్రభావం పడిందని, విండోస్ వాట్సాప్, వాట్సాప్ బిజినెస్‌లూ ఎఫెక్ట్ అయ్యాయని వెల్లడించింది.
మీ వాట్సాప్ వీడియోల్లో వైరస్ ఉంది
Related tags :