DailyDose

దిగొచ్చిన బంగారం ధరలు-వాణిజ్యం-11/19

Gold Prices Reduced-Telugu Business News-11/19

*పసిడి ధరలు దిగివహ్హ్సింది వరసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో రెండు వేల రూపాయలకు పైగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్లిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది.
* వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు కొద్ది రోజుల క్రితం భారీ స్థాయిలో నష్టాలను ప్రకటించింది. అయితే వ్యాపారం లాభదాయకంగా మార్చుకునేందుకు ధరలను పెంచుతున్నట్లుగా ఈ కంపెనీలు తెలిపాయి. ఈ చార్జీలను డిసెంబరు ఒకటో తేది నుంచి పెంచనున్నట్లు ముందుగా వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. తమ కస్టమర్లు ప్రపంచస్థాయి డిజిటల్‌ అనుభూతిని ఆస్వాదించేందుకు ప్రయత్నాలు చేస్తామని, అందుకు అనుగుణంగా తమ టారీఫ్‌ను పెంచుతున్నామని వొడా ఐడియా స్పష్టం చేసింది.
*వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,300, విజయవాడలో రూ.38,870, విశాఖపట్నంలో రూ.39,240, ప్రొద్దుటూరులో రూ.38,950, చెన్నైలో రూ.37,900గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,510, విజయవాడలో రూ.36,000, విశాఖపట్నంలో రూ.36,100, ప్రొద్దుటూరులో రూ.36,020, చెన్నైలో రూ.36,290గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,100, విజయవాడలో రూ.45,700, విశాఖపట్నంలో రూ.45,500, ప్రొద్దుటూరులో రూ.45,700, చెన్నైలో రూ.47,700 వద్ద ముగిసింది.
*మొబైల్ కస్టమర్లపై మరింత భారం పడ నుంది. వచ్చే నెల నుంచి మొబైల్ సర్వీసుల (కాల్, డేటా) చార్జీలను పెంచనున్నట్టు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సోమవారంనాడు ప్రకటించా యి.
*రుణాలపై వడ్డీల చెల్లింపు జాప్యం కారణంగా క్రెడిట్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ (కేర్) రేటింగ్ తగ్గించడంతో సోమవారం గాయత్రి ప్రాజెక్ట్స్ షేరు ధర 11 శాతానికి పైగా క్షీణించింది. బీఎ్సఈలో కంపెనీ షేరు ధర రూ.87 వద్ద ముగిసింది.
*జీడీపీ వృద్ధి రేటే కాదు. మిగతా విషయాల్లోనూ భారత్ వెనకబడుతోంది. ఐఎండీ వరల్డ్ టాలెంట్ తాజా ర్యాంకింగ్లో భారత్ 59వ స్థానానికి పడిపోయింది.
*ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ (పీజీపీఎంఏఎక్స్) ప్రోగ్రామ్కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
*ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపులను మరింత సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫే్స (యూపీఐ)తోపాటు పేటీఎం, గూగుల్ పే వంటి మొబైల్ వ్యాలెట్ల ద్వారానూ చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
*ప్రభుత్వ రంగ బ్యాంకులను ఉద్దేశపూర్వకంగా మోసగించి రూ.వందల కోట్లు ఎగ్గొట్టిన వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం నాడు లోక్సభకు వెల్లడించారు.